పుట:Andrulasangikach025988mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెదురు కొనకు రాగిపొన్నువేసి దానిని వర్తికగా (బ్రష్‌గా) వాడుకొనవలెను. వివిధమగు రంగులలో శ్వేతము, రక్తము, లోహితము, గైరికం, పీతము, హరితాళము, నీలము, మున్నగునవి కలవు. వాటి నెట్లు సిద్ధము చేసుకొనవలెనో వివరముగా తెలిపినారు. వివిధ దేవతలు, మానవులు, జంతువులు, ఏయే ప్రమాణాలలో నెట్లుండవలెనో చాలా వివరముగా తెలిపినారు.

(చూడుడు. అభి. ప్ర. 3 అధ్యా 1)

నన్నెచోడుని కాలములో ఇంకేమైన లక్షణ గ్రంథాలు, చిత్తరువులకై యుండెనేమో. "చిత్తసాధనంబులుగొని పలకఘట్టించి మెరుంగిడి త్రివటించి తిట్టంబుకొలదికిం దెచ్చి ఋజ్వాగతంబున రేఖనూల్కొలిపి పత్రిక బిందు నిమ్నోన్నతాపాంగ మానోన్మానంబు లలవరచి సలక్షణంబుగా చిత్రించెదనని" అందు వర్ణించినారు (కుమా. 5-118). ఇండ్ల ఇడుపులపై చిత్రములు వ్రాయుచుండిరి (కుమా. 8-175). శ్రీనాథుడు శృంగార నైషదమున (ఆశ్వాసం 7) ఇడుపులపై ఎట్టి చిత్తరువులు వ్రాయుచుండిరో తెలిపినాడు. పాల్కురికి, గౌరనాదులున్నూ తమతమ రచనలలో ఈ విషయమును తెలిపినారు.

యుద్ధ తంత్రము

తర్వాతి కాకతీయాదుల కాలమం దుండిన యుద్ధతంత్రమే యీ కాలమందున నుండెను. సీమాంతములందుండు దుర్గములను రక్షించుటకై పాలెగాండ్లుండిరి. నిర్ణయమయిన సైన్య ముంచుకొని అవసరమైనప్పుడు రాజు సేవలో తమ సైన్యముతో సేవ చేయుటకై వారికి "జీతపు టూళ్ల" నిచ్చుచుండిరి. సంస్కృతములయందు లేని జీతపుటూళ్ళను తిక్కన పేర్కొనెను (విరాట 3-119).

నన్నెచోడుడు దేవదానవుల యుద్ధాన్ని వర్ణింప నెంచి తుదకు తనకాలపు యుద్ధ విధానమునే విపులముగా వర్ణించెను. ఏకాదశద్వాదశాశ్వాసములు రెండును దీనిచేతనే నిండిపోయినవి. ఆ యుద్ధములో నీ క్రింది విషయములు వెల్లడియగును.

కుమారస్వామిని దేవతా సైన్యమునకు అధిపతినిగా జేసి పట్టాభిషేకము చేసిరి. వెంటనే ఆతడు ప్రస్థానభేరి వేయించెను. సైన్యమంతయు యుద్ధసన్నద్ధమయ్యెను. ఎలగోలు సైన్యమును (Advance army) ముందు పంపిరి. ధన