పుట:Andrulasangikach025988mbp.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారనైషదము, హరవిలాసము, వైజయంతీవిలాసము, బిల్హణీయము, కూచిమంచి తిమ్మకవి కృతులు, నన్నెచోడుని కుమారసంభవము మున్నగువాటిలో సంభోగాది వర్ణన లిందులేవు. కృతిని చక్కని పీఠికతో నిఘంటువులలో లేని పదాల కర్థముతో, తప్పుల సవరణతో లేని పద్యాల పూరణతో ముద్రించుట యవసరము.

2. వైజయంతీవిలాసము:- సారంగ తమ్మయ్య, ఇదే కథను చెదలవాడ మల్లయ్య విప్రనారాయణచరిత్ర మను పేరుతో వ్రాసెను. మల్లయ కవిత తమ్మయ కవితకంటె చాలా ప్రౌడముగా నున్నది. కాని మన చరిత్ర కది పనికిరాదు. వైజయంతీవిలాసమే చాలా పనికివచ్చునది.

3. పాండురంగ మాహాత్మ్యము (లేక పాండురంగ విజయము) :- తెనాలి రామకృష్ణకవి. ఇతడు వేరే తెనాలి రామలింగడు వేరే అని తలతును. తుదకు రామలింగ డను వాడుండెనో లేదో! పాండురంగ విజయములో మారుమూల పదాలు ఉద్దేశపూర్వకముగా వాడినారు. అయినను సాంఘిక చరిత్ర కిది చాలా పనికివచ్చును. ముఖ్యముగా నిగమశర్మోపాఖ్యానము ఈ గ్రంథానికి మకుటాయమానము.

4. మల్హణచరిత్ర :- పెదపాటి యెర్రనార్యుడు. సాధారణ కవిత అయినను మనకు కొంత సహాయకారి.

5. సాంబోపాఖ్యానము :- రామరాజు రంగప్ప.

6. విప్రనారాయణ చరిత్ర :- చదలవాడ మల్లన.

7. చంద్రభాను చరిత్ర :- తరిగొప్పుల మల్లన.

8. నిరంకుశోపాఖ్యానము :- సంకుసాల రుద్రకవి. ఇది మంచి కవిత. మన చరిత్రకు పనికివచ్చునట్టిది.

9. అప్పకవీయము :- కాకనూరి అప్పకవి. ఇతడు శుద్ద సనాతనుడు. బ్రాహ్మణుడు తప్ప ఇతరులు కవిత్వము చేయ నర్హులుకారని శాసించెను. అందుచేత బ్రాహ్మణేతరుల నుదాహరింపలేదు. రామరాజభూషణుని ఒకచో ఉదాహరించినది తప్పుపట్టుటకే. ఒకచో రామభద్రునిచే నెత్తిన తన్నించినాడు. చేమకూర వేంకటపతి "లక్ష్మణామాత్యపుత్రుడని" నియోగి అని