పుట:Andrulasangikach025988mbp.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడిట్టివాడు. అదేకాలమందే మరొక పండిత దిగ్గజము గోవింద దీక్షితుడను నతడు అచ్యుతరాయల కాలమందుండి క్రీ.శ. 1597 లో తంజావూరులో రఘునాథ రాయలను అభిషిక్తుని చేసెను.

ఇట్టికాలములో రామరాజు తాతాచారికి అతని యనంతరము తాతాచారి కుమారునికి అవలంబనమిచ్చి తాతాచారి వైష్ణవ దీక్షాప్రచారమునకు గాడమగు సహాయముచేసి శైవులకు కష్టములు కలిగించి వారి ద్వేషమును సంపాదించు కొనెను. ఈ కాలమందు మతత్రయము వారు తమతమ మతవ్యాప్తికై పరస్పర హింసాదూషణములతో వివాదపడి హిందూరాజ్యముల దుర్బలతకు తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునకు తర్వాతి యరాజక స్థితికి, దేశముయొక్క అత్యంతదయనీయస్థితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో ఎంత గొప్ప బాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంథ మవసరమగును.

ఇట్టి పదాలు మన సాంఘిక చరిత్రకు పనికివచ్చునట్టివే వందల కొలదిగా నిఘంటుకారులు చూచియు తమకు తోచక చల్లగా జారవిడిచినారు. కొన్ని తప్పుగా ప్రకాశకులు ముద్రించినారు. కొన్నింటికి నిఘంటువులలో తప్పు అర్థాలు వ్రాసినారు. అందుచేతనే మాటిమాటికి వ్యావహారిక పదాలను సేకరింపవలెననుట. పైనచూపిన మచ్చుపదపట్టికలోని పదాలు శిష్టసమ్మతమగు గ్రాంథికాలేకదా: అవేల నిఘంటువులలో లేకపోయెను. కావున గ్రాంథిక వ్యావహారిక మను భిన్నదృష్టి కలిగి యుండుట సారస్వతానికి నష్టము కలిగించుటయే.

ఈ ప్రకరణానికి ముఖ్యాధారములు

1. శుకసప్తతి :- కదిరీపతి ప్రణీతము. ఇది ఉత్తమశ్రేణిలో చేరిన కవిత. సాంఘిక చరిత్రకు పనికివచ్చు గ్రంథాలలో నిది అగ్రస్థాన మలంకరించును. దీనిని తప్పులతో రెండుమారులు ప్రకటించినారు. వావిళ్ళవారి ప్రతిలో కృత్యాది పద్యాలు కొన్ని లోపించినవి. అవి నావద్ద కలవు. ఈ పుస్తకములోని శతాధిక పదాలు నిఘంటువులలో లేవు. ఇందులో రంకులేని కథలు ఎనిమిదివరకు కలవు. రంకుకథలని ఘోరాభినయము కల శిష్టులు ఈ రంకులేని ఎనిమిదింటినయినను వేరుగా ప్రకటించ వచ్చును. ఈ కథలకు రంకను నిందయేకాని శిష్ట కావ్యాలనబడిన