పుట:Andrulasangikach025988mbp.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందతడు తన వార్ధక్యములో క్రీ.శ. 1582లో కాలకంఠేశ్వరాలయమును కట్టించి దానికి స్వయముగా పూజ చేసెను. అతని తండ్రి ప్రసిద్ధుడగు రంగరాజ మఖి. అప్పయ వేలూరు (ఆర్కాటులోని Vellore) నాయక రాజగు చిన్న బొమ్మనాయకు నాశ్రయించెను. అతడు శ్రీకం భాష్యమును విస్మృతి నుండి యుద్దరించి దానిపై శివార్కమణి దీపికయను వ్యాఖ్యను రచించి ఆరెంటిని 500 మంది శిష్యులకు బోధించి వారిని దేశమందు శైవ ప్రచారార్థము విస్తరించెను. చిన్న బొమ్మడు అప్పయను 'దీనారటంకాల స్నానమాడించి' కనకాభిషేకము చేసెను.

ఇదేకాలపు మూడవ యుదంతమును గూడ పేర్కొనవలసి యున్నది. ఈ అప్పయకు తాతాచారికిని సమకాలికుడు మాధ్వమత ప్రచారకుడగు 'విజయాంధ్ర భిక్షు.' అప్పయకు కనకాభిషేక మైతే ఇతనికి రత్నాభిషేక మయ్యెను.

         "విద్వద్వరోస్మా ద్విజయీంద్రయోగీ
          విద్యా సుహృద్యాస్వతుల ప్రభావ:
          రత్నాభిషేకం కిల రామరాజాత్
          ప్రాప్యాగ్ర్యలక్ష్మీ న కృతాగ్రహారాన్"

ఈ విజయీంద్రుడు తన మతమును స్థాపించుకొనువాడై అప్పాదీక్షితుని కత్తిపై కత్తిత్రిప్పి దమ్మువచ్చువరకు సాధనచేసిన వాడే. తాతాచారికూడ తన జానకిత్రాటి తుపాకితో వాదోద్ధతుడై అప్పా దీక్షితునిపై తుప్పుతుప్పున కాల్చెను కాని గురితప్పి వాదమం దోడి క్రోదఘూర్ణితుడై అప్పయను ఈ జీవలోకమునుండి తప్పించుటకు కూడ ఒప్పందమువేసెనట.... కాని తాతాచారి మంత్ర తంత్రాలను అప్పయ లెక్క పెట్టక వేంకటపతి రాయలకాలమందు కూడ ఏడేండ్లపాటు జీవించి 73 ఏండ్ల వృద్ధుడై కాలధర్మము నొందెను.

మరొక నాల్గవ విషయ మిచ్చటనే తెలుపవలసినది కలదు. జింజీ నాయకరాజు మంత్రిగా గురువుగా పండితుడుగానుండిన రత్నఖేటదీక్షితు లీ కాలమందే యుండెను. అతడు సామాన్యుడు కాడు.

          "విపశ్చితా మపశ్చిమే, వివాదకేళి నిశ్చలే
           సపత్నజి త్యయత్న మేవ, రత్నఖేటదీక్షితే
           బృహస్పతి: క్వ జల్పతి ప్రసర్పరాట్
           అసన్ముఖశ్చ షణ్ముఖ శ్చతుర్మఖశ్చ దుర్ముఖ:"