పుట:Andrulasangikach025988mbp.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కము పారిజాతాపహరణము మున్నగు యక్షగానాలను ప్రదర్శింతురు. సాధారణముగా సవతి పోరుల కథలు యక్షగాన రచయితల కిష్టము. ఈ నాటకాలకు పర్దాలు లేవు. గజమెత్తుగా స్థలమునుచేసి దానిపై పలకలు వేసి వాటిపైదుముకుచు ఆడుచు పాడుచు ప్రేక్షకుల కానందము కలిగించేవారు. రెండు దివటీలు ఆ రంగమునందు వెలుగుచుండును. కొంతదూరమందలి యొక ఇంటిలో వేషాలు తీర్చేవారు. వేషాలు రాగానే రేలంపొడి దివిటీలపై భగ్గున మండించేవారు. పాత్రదారులు అర్దళము, నీలి మున్నగు రంగులను బాగాపూసుకొని కిరీటాలు భుజకీర్తులు పెట్టుకొని సిద్ధమయ్యేవారు. ప్రతివేషాన్ని తప్పెటతో తీసుకొనివచ్చి రంగమెక్కింతురు. ఆద్వనితో నిద్రించినవారు మేల్కొందురు. ఎవరయ్యా, స్వామీ, మీరు అని సూత్రధారు డడుగును. ఓరీ నేను ఫలానా, నీవెరుగవా అని పెద్ద పెద్ద బిరుదులతో తన ప్రశస్తిని తానే చెప్పుకొనును. మధ్య మధ్య ఒక హాస్యగాడు ఎంత గంభీర పాత్రమునైనను అల్పహాస్యముతో కొంచెపరచి ప్రేక్షకుల నవ్వించును. పలుమారు ఆ హాస్యములో బూతులుండును. సంగీతము నాగరికులను ఆకర్షించదు. నృత్యము కూడా పలుకలు విరుగు గంతుల సాముగానే యుండును. అయినా ఇవి పూర్తిగా మాయం కాకముందే నాటకాలాడించి పటాలు తీసి వివరరాలతో ప్రకటించుట మంచిది. జవాద్వీపములోని జాతీయనృత్యములను పలుమారు ఇంగ్లీషు పత్రికలలో కిరీటాలతో భుజకీర్తులతో నుండు వేషాలను ప్రకటింతురు. వాటిని జూచిన అవి మన యక్షగానాల వేషాల వలెనే ఉండును. జవాలో రామాయణ భారతకథలను నాటకములుగా ప్రదర్శింతురు. ఆ దేశానికి మనవారే యీ నాటకాలు తీసుకొనిపోయినారో లేక అక్కడే యక్షు లనే వారుండిరో వారినుండియే మనవారు గ్రహించిరో ఆ దేశ నృత్య చరిత్రను బాగాపరిశోదించిన తెలియగలదు. ఎరుకలు మనదేశమువారే కాని వారి భాష నేటికిని చెడిన అరవము. వారు అరవ దేశమునుండి వచ్చినారు. కొరవంజి అనువారు ఎరుకలసమానులైన కురువలో చెంచువంటి అటవికులోయైయుందురు. శుకసప్తతిలోని కురువంజి బదనికలు తన సింగడు అడవినుండి తెచ్చినవాటిని అమ్మెను. అనగా దానికి చెంచులకును సంబంధము కానవస్తున్నది. మొత్తానికి యక్షగానాలు అటవికులనుండి నాగరికులకు లభించిన గాన సమాయుక్త నృత్యప్రాధాన్య నాటకాలు. సంస్కృతములో ఉత్తమస్థాయి నొందిన నాటక విధానమును మనకాలమువర కొక్కరును అవలంబించికపోవుటజూడ