పుట:Andrulasangikach025988mbp.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నికి అన్యాయము కూడదని నిదర్శనముగా నొక కథను వినిపించెను. కుమారునికి కథలపై మనసుపోలేదు. కల్లలపైననే మనసు నిలిచి యుండెను. పోగాలము వచ్చినందున ముదుసలి కొడుకు నిర్బంధముపై రాత్రియే వెళ్ళి చెట్టు తొర్రలో దాగియుండెను. అంత ప్రొద్దుననే 'పిన్న పెద్ద లుభయవాదుల రావించి వృక్ష సమీపంబునకు వచ్చి యర్పించి అయ్యిరువురిలోన వంచకు డెవ్వడు చెప్పుమనిప్రాంజలులై నిలిచిన, ముదుసలి దర్మబుద్ధియె వంచకుడని తొర్రనుండి పలికెను. అందరును ఆ మాటకు వెరగందిరి. దుష్టబుద్ధి యానందించెను. విన్నవారందరు కరతాళములతో మెచ్చుకొనిరి. చెట్టేమి పలుకుటేమి; ఇందేదో కుత్సిత మున్నదని ధర్మబుద్ధి చెట్టు తొరటవద్ద మంట పెట్టించెను. దానితో ముదుసలి చచ్చి బయట పడెను. అప్పుడు రాజపురుషు లాదుష్టబుద్ధిని వీక్షించి "సెల్లు సెల్లముల కీక్షింప నిచ్చిన సొమ్ము మగుడ నీలేని కోమటి గులాను చేసేత విశ్వసించిన వారి వెచ్చపచ్చముల గీడ్పరచు వై జాతి తొండ!.......చెడగరపు డొక్క! యోరోరి సెట్టికుక్క!!" అని తిట్టి సొమ్ము ధర్మబుద్ధి కిప్పించి దుష్టబుద్ధిని కొరత బెట్టిరి.' (పంచ తంత్రము. 1-701) నుండి 764 వరకు.)

పంచాయతీ విధానమును సమగ్రముగా తెలుపు నీ కథ చాలా విలువకలది

కళలు

ముత్యాలవలె ముద్దుగా సుందరముగా వ్రాయుట యొక కళగా, ఒక ఘనతగా పరిగణించిరి. ఒక మంత్రియొక్క వివిధలిపి సౌష్ఠవమును శ్రీనాథుడు వర్ణించి యుండెను. "వేంకటోర్వీశు వ్రాయసములు వ్రాయు చాతుర్యమును" చంద్రభాను చరిత్రమందు పొగడినారు[1] గాజుకుప్పెలు, దంతపు బరణులు, శిల్పులు సిద్ధము చేయుచుండిరి. [2] వైష్ణవులు దశావతారాలు వ్రాసిన బిల్వకరండలలో తిరుచూర్ణ ముంచుకొనెడివారు. (విప్ర. 2-28) ఆట పాటలకు బోగంవారే ప్రధానధారములు. వారి సమ్మేళనమునకు మేళ మనిరి. [3] నేడును "బోగం మేళం" అందురు. వృద్ధవేశ్య, పాటపాడు యువతులు, నాట్యమాడు సుందరులు"

  1. చంద్రభాను. 1-39.
  2. విప్రనారాయణ. 3-28.
  3. వైజయంతి. 2-2.