పుట:Andrulasangikach025988mbp.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నము స్పష్టముగా వెల్లడి యైనది. పంచాయతి విదానమును వేంకటనాథు డను మరొక కవి తన పంచతంత్రములో నొక కథయందు చక్కగా వర్ణించిన దిచ్చట సంగ్రహముగా తెలుపుట అవసరము.

"ఒక పుఠములో ధర్మబుద్ధి, దుష్టబుద్ధి యను అన్వర్థనాములగు కోమటి నేస్తగాండ్లుండిరి. ఒకనాడు ధర్మబుద్ధికి నొకచో 1000 దీనారములు భూస్థాపితమైనవి దొరికెను. ఆ సంగతి మిత్రుడగు దుష్టబుద్ధికి తెలుప, వాడు దాని నొక పొగడచెట్టువద్ద పొలిమేరలో దాచిపెట్టించెను. అదేరాత్రి ఒంటిగా దాచినచోటికి దుష్టబుద్ధి వెళ్ళి, బలికూడు చల్లి, ధనమును తీసుకొని కొన్నిదినాల తర్వాత మన నిక్షేపమును చూచివత్తమని ధర్మబుద్ధిని గొంపోయి అందు నిక్షేపమును గానక యిద్దరును వాదులాడి రచ్చకీడ్చుకొని చని 'నగరంబడి ధర్మంబునకొప్పి పిన్న పెద్దల గూడబెట్టిన ధర్మవేదు లుభయవాదుల నాలోకించి తమకింపక, రంతుసేయక, అడ్డంబు సొరక, ఇరువురు గలసిపలుకక, ఒక రొకరి పూర్వోత్తరంబులు తెలియునట్లుగా, మీమీ సుద్దు లుగ్గడింపుడనుటయు నందు ధర్మబుద్ధి కృతాంజలియై సభవారి కిట్లనియె. (ఇప్పటికోర్టుల నియమములు కూడ ఇట్టివే!) 'అయ్యా, నేను ఇతడును ప్రయాణించుతరి నేను ఒక నిష్కభాండమును కనుగొంటిని. స్నేహితుడని యితనికి తెలుపగా నొక చెట్టువద్ద సంకేత మేర్పరచి భూస్థాపితము చేయించెను. ఇతడే కొన్ని దినాలతర్వాత నిక్షేపక్షేమమును చూచి వత్తమని పిలుచుకొనిపోయి చూడగా నది లేకుండెను. నేను దొంగనని నాపై తప్పుపెట్టి యీ సభకు తెచ్చినాడు. ఇంతియయని ధర్మబుద్ధి యూరకుండె, నప్పుడు దుష్టబుద్ధి ధర్మాసనస్థులకు ప్రణామంబు లాచరించి యిట్లనియె. "చెట్టుసాక్షిగా ఆ ధనమును వీడే తీసుకొన్నాడు.

        'నా విని దర్మాధికృతుల్ వా వాదంబేల యేనువారము లెడ మీ
         రే వివరమునారవనా డావిష్కృత బుద్ధి దెలుపు డడుగును మగుడన్‌'

అని పేషీ వేసిరి. కాని దుష్టబుద్ధి అంతదూర మెందుకండీ; నేనిప్పుడే సాక్ష్యమిప్పింతుననెను. ఎవ్వరయ్యా నీ సాక్షియన ఏ చెట్టువద్ద ధనము దాచితిమో ఆ చెట్టే నాకు సాక్ష్యమిచ్చునని దుష్టబుద్ధి పలికెను. దానికి పెద్ద లాశ్చర్యపడి మరునాటికి కాలము నిశ్చయించిరి. దుష్టబుద్ధి రాత్రి తన తండ్రివద్ద చేరి చెట్టుతొఱ్ఱలో రాత్రియే దాగి మరునాడు పరిషత్తు పెద్ద లచ్చటికి వచ్చినప్పుడు తన పక్షముగా చెట్టు పలికినట్లు చెప్పుమని నిర్బంధించెను. ముదుసలి కుమారు