పుట:Andrulasangikach025988mbp.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          కుడివలన నింత యోరగా కొమరు మెరసి
          బిడ్డ చనుద్రావ నిట్లను బిసరుహాక్షి"

       ప్రారంభించిన వేదపాఠములకున్ ప్రత్యూహ మౌనంచునో
       యేరా! తమ్ముడ1 నన్ను జూడ జనుదే వెన్నాళ్ళవో యుండి, చ
       క్షూరాజీవయుగంబు వాచె, నిను కన్గోకున్కి, మీబావయున్
       నీ రాకల్ మదిగోరు చంద్రుపొడుపున్ నీరకరంబుం బలెన్.'

అని తదీయ దురాచరణ స్మరణ సంతప్తస్వాంతయైస్వాంతయై ఇట్లనియె:-

       పడబడ బారుచున్ వడకు పట్టిన తల్లిని దండ్రి, నేలలో
       వెడలని తమ్ము గుర్రల, నవీన కులాంగన, నోరులేని యీ
       తొడుకుల, బంటుపైద; విడద్రోవక ప్రోవగ నెందు, నీక పా
       ల్పడినది కర్ణు నౌదలనె భారత సంహిత నిల్చుచాడ్పునన్.

అని యింకను కరుణాభరితముగా చక్కని యుపదేశ మిచ్చెను. ఇదంతయు అతి సుందరముగా బ్రాహ్మణ కుటుంబ జీవనమును వర్ణించిన ఘట్టము. ఈ నిగమశర్మోపాఖ్యానము ఉత్తమ రసపూరితమగు గాథ. మన చరిత్రకు చాలా పనికివచ్చునట్టిది[1] పాము కరచిన విష చికిత్సలను నానావిధములుగా చేయుచుండిరి. 'పాము కాటువేసిన తావున కత్తితో కాటుపెట్టి రక్తము స్రవింప జేయుట. ఘట పూర్ణ మంత్ర పుష్కరధార లెత్తించుట, పసరు నడినెత్తిన రుద్దించి బెత్తముతో నిట్టటు మోదుట, బిగించుకొనిపోయిన దౌడలలో కర్రుజొనిపి మందులుపోసి మంత్రాలు చదివించుట యనెడివి కొన్ని యవస్థలై యుండెను. (వేంకటనాథుని పంచతంత్రము 1-119,120.)

సంస్కృత పంచతంత్రములో లేనివై వేంకటనాథునిచే క్రొత్తగా చేర్చబడిన విషయాలను మాత్రమే చర్చకు తీసుకొందును. బహు విషయములను బహువర్ణనలను మూలములో లేనివి వేంకటనాథుడు తెనుగులో నెక్కువగా వ్రాసినాడు.

చలికాలములో జనులెట్లు జీవించెడివారో వేంకటనాథుడు చాలా చక్కగా నిరూపించినాడు. తాంబూలము, సొంటి, అగరు ధూపము, గొంగళ్ళు, దొడ్డు

  1. పాండురంగ విజయము. 3వ ఆశ్వాసము.