పుట:Andrulasangikach025988mbp.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వడి=కాచులో పాలు, మొగలిపూల రసము వేసుకొని గోలీలుగా చేయుదానికి పేరు) (కప్పురపు వీడియంబును కైరవళ్లు నొసగె"[1] అనియు వర్ణించినారు. సంపన్నులు సంపెంగ నూనెతో తలంటుకొని మాష చూర్ణము (మినుప పిండి)తో రుద్దుకొని స్నానము చేసెడివారు.[2] గార చెక్కను దంచి బావులలో చెరువులలో కలిపిన చేపలు వాటిని తిని చచ్చితేలును.[3]

రాజులు భోగమువారికి (సంగీత నృత్యములను మెచ్చుకొని.) అటులే కవులకు, కళావిదులకు 116 లేక 1116 లు, మరియు ఇతర బహుమతులిచ్చి యాదరించిరి.

         "అపు డాచోళవసుంధరాధిపతియున్ నానార్ఘ్య భూషాంబరా
          ది పదార్థప్రకరంబు త్యాగమహిగా దీనారము ల్వేయూనూ
          ట పదార్లుం గృపచేసె.........."[4]

          నూటపదార్ల సంఖ్య ఇంచుమించు ప్రాచీనమగు తెనుగు ఆచారమే!

విందులలోని భక్ష్య భోజ్యాల వివరాలు పూర్వ ప్రకరణాలలో తెలుపనైనది. ఈ కాలమందును అట్టివే యుండెను. బావమరుదులవరుస వారు భోజన సమయాలలో వ్యంగ్యంగా ద్వ్యర్థిగా హాస్యాలాడుకొనిరని జుగుప్సాకరముగా సాంబోపాఖ్యాన మందు వ్రాసినారు. (అ. 5-289) అది కవితకు న్యూనత. విందులలో మొదట నేయిగలిపి తియ్యగూరలతో అన్నము తినిరి. తర్వాత మధుర వ్యంజనములు తర్వాత ఆమ్లసారశాకములతో అన్నము తినిరి. తర్యాత రసవరిపాకముల భుక్తితో, శిఖరిణితో, అటుపై పెరుగన్నముతో ముగించెడి వారు. ఇంతేకాదు, చాపట్లు, మాంసము కూరలు, బ్రాహ్మణేతరులలో పలల సారము (మాంసము పులుసు), మండెగలు, కుడుములు, మామిడిపండ్లు లేక ఆ ఋతువున దొరకు పండ్లు ఆరగించెడివారు.[5] శిఖరిణి అన సిగరి అనియు, నది "కొన్ని సంబారువులు చేర్చి పక్వముచేసిన మజ్జిగ యనియు" శబ్దరత్నా

  1. మల్హణ. పుట 45.
  2. వైజయంతి. 4-59.
  3. వైజయంతి. 2-140. (గార ద్రావినమీను)
  4. వైజయంతి. 1-132.
  5. సాంబోపాఖ్యానము. (296-303)