పుట:Andrulasangikach025988mbp.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుకట్టె సేవజేయుట అనగా ఊడ్చుట. తిరుమాళిహ (తిరుమాలె) దేవాలయము కాని, వైష్ణవభక్తుల యిండ్లుకాని యని యర్థము. తిరువంజనము (తిరుమజ్జనము=స్నానము.) తిరువళకు (తిరువెలుగు=దీపము) అని వారందరు.

          "కూరలు నన్నము, తిరుపణ్యారము పచ్చళ్ళు తిరుకణామధు మధురా
           హారములు నవ్వధూటికి సౌరుచి ముప్పూట లునుప సాపడ బెట్టున్"

          "స్నామి యల కంచినుండిట మీ తిరువడిఘళాశ్రయించుట విని"[1]

అనుటలో తిరువడిఘళ్ అన పాదములు అని యర్థము. విప్రనారాయణ చరిత్రలోను తిరువీసము, తిరుపావులు, తిరువందేరములు (భక్ష్యములు) గండవడములు (తెరలు) మున్నగు అరవపదాలు వాడినారు (5-8, 12) శ్రీవైష్ణవులకు గండవడములు, తిరుమణిపెట్టె, విరులగడి (బుట్ట), కావి వేష్టువ (థోవతి), జింకతోలు, ఊర్ధ్వచూర్ణకరండము, తులసి వేరు "అధ్వ ఖేదాపహంబైన దవిత్రము," కుశాస్తరణము ముఖ్యసాధనములు. (దవిత్రము తప్పు; ధవిత్రము అనవలెను. అనగా జింక చర్మముతో చేసిన విసనకర్ర అనియర్థము.)

దాసరిసాని వేషములో చీనిపడవ దానిమీద "ముసుగువడ జుట్టిన పైలకముద్ర[2] యొక విశేషము, పైలకముద్ర పదము నిఘంటువులలో లేదు. ఈపదము తర్వాత ఇదే వేషమును వర్ణించి కవి యిట్లు వ్రాసినాడు.

          "అడచి క్రొమ్ముడి బయల్పడకుండగా ఖండ
           శాటి యౌదలను మించగ బిగించి"

అనుటచే చిన్నబట్టతో నెత్తి కొప్పును ఎత్తి బిగించుట అని యర్థమగును. అందుచేత ఇదే పైలక ముద్రయై యుండును.

తాంబూలము వేసుకొనువారు పాన్ దానుల నుంచుకొనిరి. వాటిపై సన్నని తీగెలపని చేసియుండెడివారు. అందుచే వాటిని జాలవల్లిక లనిరి. "జాలివల్లికతోడ బాగాలు తెల్లనాకులు కైరవళ్ళు నెదుట బెట్టెను"[3] (కైర

  1. వైజయంతి 2-15. 121, 131.
  2. విప్రనారాయణ చరిత్ర 2-87.
  3. వైజయంతి 4-7.