పుట:Andrulasangikach025988mbp.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          రొక్క కరంబువందు, పద యుగ్మమునం బిగివాళ్ళు గల్గి న
          ల్దిక్కుల నధ్వగుల్బడలి త్రిమ్మరి రట్టి కడిందియెండలన్."

(బిగువాళ్ళు అన బిగువగు వారులుకల చెప్పలని యిప్పుడే వ్రాసినాను కదా! ఇచ్చట "పదయుగ్మమునన్ బిగివాళ్ళు అనుటచే అదు సుస్పష్టమైనది, చక్కెర చింతపండు నోరెండకుండుటకు ఏలకి చద్దియన ఏలకి, మిరియాలు, అల్లము, సొంటి, ఉప్పు, తిరుగవాతకల దధ్యన్నమని యర్థము. నెత్తిన కానుగాకు చలువకై ఎండవడ (Sun-Stroke) తాకకుండుటకై పెట్టుకొందురు. కానుగాకు చాలా చలువ యిచ్చునది. క్షయ, తాపము కలవా రా చెట్టుక్రింద కూర్చునిన తాపము పోవును. తెలంగాణమందు ఎండకాలమందు కూలిపని చేయువారు తమ గుండు రుమాళ్ళలో తెంగెడాకు దట్టముగా పెట్టుకొని రుమాలను నెత్తిన అదిమి ఎంత యెండలోనైనను పని చేయుదురు. తంగేడాకు సులభముగా సర్వత్ర లభ్యమగును. కానుగాకు అరుదు. కానుగాకు తర్వాత తంగెడాకు పనికి వచ్చును. ఈ పద్యము కవియొక్క చక్కని లోకానుభవమును వ్యక్తీకరించినది.) పుణ్యము కోరువారు బాటలందు చలివేంద్రలు పెట్టి స్త్రీలను నీరుపోయుటకుంచిరి. కవులు స్త్రీలనే ప్రపాపాలికలనుగా జేసి సరసాలాడిరి. మన్మథుడను వేటకాడు నీటిపల్లములను కుండలనుంచి, అందు ప్రపాపాలికలను దీమములుంచి, వారి కటాక్షాలను వలలుంచి, పాంథమృగాలను బోయవలె వేటాడెనని కవి వర్ణించుటయు అతని అనుభవమునకు తార్కాణ.[1] వర్షాకాలమందు బాటసారులు బురదలో దిగబడి బాటతప్పి పొలమర్ల (జాడలు తెలిసినవారి) పిలిచి, నల్లరేగడిలో జారిపడి, ఎదురువానకు తలయెత్తక, ముందర కానక, జల్లుకు చెట్లక్రింద చేరి, వాన వెలసినతర్వాత వంగుళ్ళ (ఆకులనుండి జారు తటుకుల) వల్ల తడిసి జమ్ము గూడలపైన వేసుకొని చేతులలో చెప్పులను పట్టుకొని నానావస్థలు పడిరి.[2] ఇది జమ్ము సమృద్ధిగా పెరుగు కృష్ణాజిల్లాను సూచించును.

"శిఖినిండ తాయెతు చేరుచుట్టి"[3] అని కవులు పలుమారు వర్ణించినారు. శుకసప్తతిలోను ఇట్లే కలదు. తాయెతులు చేతికి మొలత్రాటికి మెడకు కట్టు

  1. చంద్రభాను. 1-161, 2.
  2. చంద్రభాను. 5-39.
  3. చంద్రభాను 3-77.