పుట:Andrulasangikach025988mbp.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నపు కట్టెతోచేసిన కట్టెసోల, కడపజిల్లాలో శ్రీచందనము అను నొక సాధారణ వృక్షము విశేషము. దానితో నేటికిని కట్టెసోలలు, జడిగములు చేయుదురు. మాళ్లు నిఘంటువులలో లేదు. పెసరవంటి కాయధాన్యమని యర్థము.)

రెడ్ల యిండ్లిట్లుండెను:-

          "అచ్చమై వాకిట రచ్చరాయిమెరుంగు
              పంచతిన్నెలు, గొప్ప పారిగోడ
           కంప తెట్టులును, రాకట్టు ముంగిలి
              మల్లె సాలె, దేవర యిరచవికె యొకటి
           కోళ్ళగూండ్లను'గొర్రు, గురుగాడి,
              యేడికోలలు కాడి పలుపులు గలుగు నటుక
           దూడలు, పెనుమూవకోడెలు కురుగాడి
              గిత్తలీనిన మెటి గిడ్లదొడ్డి
           ఇరుకు మ్రాను, పెరంటిలో నెక్కుబావి,
           మునుగలును, చొప్ప, పెనువామి, జనుముదుబ్బు,
           రోలు పిడికెలకుచ్చెల, దాలిగుంత దనర
           వగతంబు వెలయు నాతని గృహంబు.1

'మల్లె సాలె ' అన భోజనశాల అని నిఘంటు కారులన్నారు. అది సరికాదు. ఉదాహరణ మిది.

         పరదేశులకును | గుళ్ళుం బంచలును, రచ్చకొట్టంబులు, నం
         గాక తలంపగ : చల్లని సున్నంపు మల్లసాలలు గలవే ?
                                   హరిశ్చ. 4, 5. 194.

మల్లశాలకు చల్లని సున్నముండుట అరుదు. తెలంగాణమందు మల్ భవంతి (Drawing Room) అను నర్థము కొన్ని తావుల వాడుచుండుట సరిపోవును.

అప్పుడు జొన్నచేలకు మంచె వేసి కావలి కాసెడి వారు. ఇప్పపూవు లేరి సారాయి చేసుకొనెడి వారు. ఆనాడు లైసెన్సు లేకుండెను. మధ్యాహ్నము