పుట:Andrulasangikach025988mbp.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           పెరటిలో నారికేళి జంబీరముఖ్య
              నిఖిలఫలవృక్షములు మంచినీళ్ళబావి,
           నమరనయ్యింట నిత్యకల్యాణములును
              పచ్చతోరణములు మించబరగునతడు"[1]

(బోరుతల్పులు=పెద్దగవని తలుపులు, కణజుములు పాతరలు, తాళు వారము శ.ర. నిఘంటువులో లేదు. వాచస్పత్యములో స్తంభముల మీదికి దించిన పోఫా అని వ్రాసినారు, చిలువానము శ. ర. లో లేదు. ఆంధ్రవాచస్పత్యములో ధనము అన్నారు, సూ. రా. నిఘంటువులో ఇంటిఖర్చు, చిల్లరఖర్చు అని వ్రాసినారు. ఆ యర్థము లిచ్చట సరిపోవు. బ్రాహ్మణులు కొందరు గొప్ప భూస్వాములై యుండిరి. వారియెడ "బాపల సేద్యం బాలవైద్యం' అనుసామెత చెల్లకుండెను. వారి సేద్యము వారి తోటలు, పంటలు, గరిసెలు యిట్లుండెను.

          గాదెలగొలుచు ముక్కారు బండెడు మళ్ళు
             అత్తోపు, నడబావు, లండదొడ్డి
          ఆకుతోటలగుంపు, పోకమ్రాకులు, గుత్త
             చేలు, గొర్రెలకదు పాలమంద
          చెఱకుగానుగ మొదల్జెడక వర్ధిలునేర్పు,
             బానిసల్ పడవాళ్లు, బంటు, పైద
          పారిగోడలు, గొప్పపడసాల మేల్మచ్చు
             గారముంగిలి, వింతగాని పొరుగు
          రాగినగలు, పదాచార రతియ, దేవ
             పూజ, నిత్యాన్నదానంబు, పూసబొట్టు
          చిదురు జల్లిన తులసెమ్మ చిన్నితిన్నె
             కలిగి కనుపట్టు నాతని కాపురంబు."[2]

(పైద అన పిల్లకాయ అని శ.ర.లో కలదు. అది తప్పు. వాచస్పత్యము పయద రూపము అన్నారు. అదియు తప్పు. శ.ర.లో పేద అనుదానికి భటుడు అని వ్రాసినారు. అది సరి. అదే అర్థము పైదకును కలదు ప్యాదా అను ఫార్సీ పదము పాదచారి అను నర్థము కలదానినుండి పేద, పైద యేర్పడి

  1. శుక. 3-477.
  2. శుకసప్తతి. 2-145.