పుట:Andrulasangikach025988mbp.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           లికుచ కుచవేషమేకాన యకట:
              దాని యొరపులేదని యాత్మలో పరితపించు"[1]

రెడ్డి స్త్రీ:-

పై పద్యములో కొంత తెలియవచ్చినది, మరికొన్ని విశేషములు గమనింపదగినవి:-

          "గొంటుపూసలు రెండుగుండ్ల ముంగరలు,
               మైజారుచీరలు పెన సన్నగొలుసు
           పెద్దమట్టెలు మట్టిపిల్లాండ్లు, బొబ్బిల
               కాయలొత్తులతోడి కడియములును
           కప్పు పల్వరుస లుంగరములు తూలెడు
               కొంగులు బలు చెంప కొప్పులంచు
           కమ్మగవల్ సన్న కాటుక రేఖలు నాభినామంబులు నానుచుట్లు
           పసుపుపూతలు......బిగువు రవికెలు........"[2]

కలిగియుండిరి. పై పద్యములో బొబ్బిలికాయలు నిఘంటువులలో లేదు. కాలి మూడవ వ్రేలి మట్టెలను బొబ్బిలికాయ లందురు.

జంగమురాలు:-

మర్రిపాలుపూసిన జడలదిండు. చింతాకంత విభూతిరేఖ, సందిట రుద్రాక్షపూసలు, నాగబెత్తము, తామ్రపు నందిముద్ర యుంగరము, జన్నిదపు వాటు, యోగపట్టె కలది.[3]

ముత్తైదువులు:-

ఆ కాలపు ముత్తైదువలు పసుపు పూసుకొనిరి. కాటుక పెట్టిరి. పత్తి బొట్టు పెట్టిరి.[4]

  1. శుకసప్తతి. 2-457.
  2. శుకసప్తతి. 2-332.
  3. శుకసప్తతి. 2-32.
  4. శుకసప్తతి. 2-105.