పుట:Andrulasangikach025988mbp.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీనమయిన నృత్యగానాలనియు, అవి చెంచువారినుండి స్వీకరించి సంస్కరించినవనియు నూహింపవచ్చును.

రాజులు:-

సిగలో తాయెతులు, నెత్తిపై కుళ్ళాయి, చెవులలో యొంటులు (పోగులు), మెడలో ముత్యాల హారాలు, బంగరు గట్టికమ్ముల వలిపె దుప్పటి వలెవాటు ధరించెడివారు.[1] పనరు పట్టు హిజారు (లాగు), అంగీ, పచ్చరాళ్ళ పోగులు, జీవదంతపు పాపలుకూడా ధరించెడివారు.

భటుడు (జెట్టి):-

గీరునామము, చిన్న కోరమీసలు, వెనుకకట్టు రుమాలు, కమ్మిపంచె, కమ్మి దుప్పటి వల్లెవాటు, కెంగేలిలో వంకవంకి, అపరంజి పరజుతో దగు కత్తి, (పరజు నిఘంటువులలో లేదు.) బచ్చెన (రంగువేసిన) పావుకోళ్ళు, చౌకట్లు (నాలుగు ముత్యాలపోగులు) ఇవి అతుధోపజీవుల వేషములు.[2]

బ్రాహ్మణ స్త్రీ:-

ఒక పంచాంగమయ్య రెడ్డికోడలిని మోహించి తన భార్య అంద చందాలు మెచ్చక యిట్లు పోరుపెట్టెను.

          కీలుగంటిది యేల పోలగా నునుగొప్పు
             గీల్కొల్పు కొమ్మంచు గీజుపోరు
          పసుపుబొట్టిదియేల నొసట విభూతిరేఖ
             యమర్చి కొమ్మంచు కంటగించు
          కాసెకట్టిదియేల కవురుగా మైజారు
             చీర దాల్చు మటంచు చిమ్మరేగు
          లత్కాకు లివియేల చొక్కంపుటంచు
             కమ్మలు ధరించుమటంచు నలుకగాంచు
          భార్యతో నా యమయు వెర్రిపట్టెనేమొ
             యనుచు నాలాగె కావింప నతడు హలిక

  1. శుకసప్తతి. 1-116; 1-249.
  2. శుకసప్తతి. 2-241.