పుట:Andrulasangikach025988mbp.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(హిజారు) తొడగినాడు. చీనీ దేశపు నీంతాన్ బట్టను నెత్తిమీదుగా కట్టినాడు. (కంబరు అంటే యేమో?) శరీరము కనబడునట్టి సన్నని నూలు అంగీ తొడిగినాడు. సెల్లాను చంకల క్రిందుగా త్రిప్పి బుజముపై వేసినాడు. చంకలో (పడుదల) జందెమువలె తోలుపట్టీ వేసుకొని దానికొక డాబాకత్తిని తగిలించినాడు. పాపోసులు (ముచ్చెలు) తొడిగినాడు. వెంట గుర్రపుసైసు మాదిగ (నభరువాడు) వచ్చినాడు. సీలు అంటే తెలియదు. పాపోసు పార్సీపదము. పాయెపోష్ (పాదమును రక్షించునది) అనుదాని నుండి యేర్పడినది. అచ్చులో నభరువాడు అని ముద్రించినారు. అది అర్థములేనిమాట. నభరు అని యుండవలెను. ఇది నిఘంటువులలో లేదు. తెలంగాణా పల్లెలలోని రెడ్లు సైసువాన్ని "నఫర్వాడు" అని యందురు. అదే యీ నభరు పదము. ముస్తయీద్ అను అరబీ పదమే ముస్తైదు (Ready) సిద్దముగా తయారుగా నుండునట్టి అని యర్థము. అట్టి 'తురక' బంటు గ్రామ మధ్యనుండు రావిచెట్టుకల రచ్చకట్టువద్ద నిలిచి "తలారికీ బులావ్ ధగిడీకే" అని అరచినాడు. ఈ వేషము, ఈ తిట్టు నేటికిని తెలంగాణాలో ప్రత్యక్షానుభవమే! చిన్నబంటు వేషము వాని గుర్రము, వాని సైసు, వాని దర్జా, వాని తిట్లు చూచి విని రెడ్డి, కరణాలే పారిపోయిరి! గోలకొండ సుల్తానులు కొత్తగా ఆంధ్రదేశాన్ని ఆక్రమించుకొని తమ తురక భటుల కిచ్చిన దర్జాను తెలుపుతున్న దీపద్యము. అనగా ఇంచుమించు క్రీ.శ. 1630-50 ప్రాంతము.

రెడ్డి:-

          "మొలకు సగంబును తలకు సగంబుగా
               గట్టిన యయగారి కరలచీర
           పై నల్లకమ్ముల పచ్చడంబును తోలు
               పావలు చేతిలో బట్టుకర్ర
           కత్తెర గడ్డంబు, కరకు జుంజురమీ
               సములు రోమశంబైన పలకరొమ్ము
           మొలయుంగరము వ్రేల వలముగా దీర్చిన
               నాభినామము బీదవరము లమరు
           గడుసుపిక్కలు గలిగిన మడిమ లమర
               వెంట నిరువంక పెంపుడు వేపు లరుగ