పుట:Andrulasangikach025988mbp.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలార్లు కట్టెకు చిన్నచిన్న ఉక్కు ఇనుము బిళ్ళల గుత్తులను కట్టి చేతబట్టెడివారు. ఆరిగె లనిన కేడము అన్నారు నిఘంటుకారులు. డాలులను తోలుతోను, ఇత్తడితోను, కంచుతోను, ఇనుముతోను చేయించెడివారు. ఇచ్చట తెలిపినది కంచుడాలు. దానికి మూడుకాని, నాలుగుకాని గుడుపులుండును. ఆ గుడుపులలో సన్నని ఇనుప గోలీలు వేసెడివారు. అవియే 'రవళి' చేసినవి. ఉక్కుపై విగ్రహాలు వేయించెడివారు. పలువురు సింహాలను, పులులను వేయించెడివారు. ఇచ్చట హనుమంతుని వేయించినారు. ఒకబోగముది శివుని గొలిచి దేవాలయమునుండి వెళ్ళుచు,

        క. గుడివెడలి వైష్ణవులు గనుపడకుం
           డగ జెలుల సరిగ పట్టుమటంచున్
           పడతి తనయింటికడకున్ వడి జని
           నిజజనని బిలిచి నగుమొగ మలరన్.[1]

అని మరొక కవి వర్ణించుటచే కేవలము డాలే యని యర్థము చెప్పుటకు వీలులేదు. ఛత్రివంటి సాధన మనవలెను.

దాసరిసాని:- కావి కుప్పసము తొడిగి, కొప్పు బయలుపడకుండ ఖండశాటి (చీరబట్ట) బిగించి, జమిలి పూసలకంటె పెట్టుకొని హరిహరీ యనుచు నడిచెను.[2]

కరణము:-

          "ముదుక తలపాగయును బాహుమూలమందు
           కవిలెచర్మపు టొరలోని కత్తిగంట
           మలతి నీర్కావిదోవతు లమర గ్రామ
           కరణ మేతెంచి రెడ్డిచెంగట వసించె.[3]

మాదిగెజోగురాలు:- పసుపుబొట్టి, మెడలో (దేవి) తోలు పాదాలు, నిడుద గవ్వలదండ, దర్శనపుదండ, "ఎడమచే బళ్ళిక నిడిన జంఱారన్యపాణి

  1. శుకసప్తతి. 3-47.
  2. విప్రనారాయణచరిత్ర. 3-3.
  3. శుకసప్తతి. 2-413.