పుట:Andrulasangikach025988mbp.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(కచ్చలపాగ=చుంగులరుమాల. దంట=జంట..

వృద్ధవేశ్య:-

అమ్మగారిపుట్టము కట్టి. అక్కలదేవి తోలుపాదాల చిహ్నములుకల హారము ధరించి, చిట్టికుంకుమబొట్టు పెట్టి, ముత్తెపుకంటె ధరించియుండెడివారు.[1]

భటుల పెద్ద:-

          "కొనముక్కుపైనుండి కనుబొమ్మలకు వెళ్ళ
                               నాభినామమును సన్నముగ దీర్చి
           చెవిచెంత కొరగవేసిన కోరసిగసందు తెల్లచెంగులబట్ట వెళ్ళ జుట్టి
           చెరుగు దిక్కున తోకచెరగు దూలగ నీలి
                               కాసెచే హనుమంతు కాసె వేసి"

తలసరి మంటపమున (Police Station) దండనాయకుడు (Sub Inspector) అమీన్ ఉండెను.[2] వారి దర్జా కూడా ఇప్పటి అమీన్లకు తక్కువది కాదు.

           చలదయ:పత్రికోజ్జ్వల దండకాండముల్
               ఘల్లు ఘల్లనుచు ముంగల చెలంగ
           నునుపారి చికిలిచేసిన విచ్చుకత్తులు
               తపనదీప్తుల తళ త్తళ యనంగ
           హనుమదాకృతులు వ్రాసిన కంచు
               టరిగలు జాళించు రవళిచే డాలు మించ
           ఆదరు క్రోవుల మ్రోత కదరి నల్దిక్కుల
               నార్తరావముల వాయసము లరుగ
           ముందటను కంచుకొమ్ము మిన్నంది మొరయ
               జార చోరుల గుండియల్ ఝల్లనంగ
           వెడలి కోలాహలంబుగా వేశ్యవాటి జేరి
               యప్పట్టణము తలవారి గాంచె"[3]

  1. వైజయంతీవిలాసము. 3-71-72.
  2. వైజయంతీవిలాసము. 4-67.
  3. వైజయంతీవిలాసము. 4-78.