పుట:Andrulasangikach025988mbp.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని యొకదయ్య మనెను[1]. సివసత్తులకును, తలారులకును, బవనీలకు, ఆటపాటలవారికి తిరిపెపు కల్లు దొరికెడిది[2]. సివసత్తు లను పదము నిఘంటువులలో లేదు ఆది శివశక్తి తద్బవము. కొందరు స్త్రీలు సాధారణముగా బసివిరాండ్రు శివమెత్తి (పైనిండి-అని తెలంగాణము మాట. అనగా మైనిండి) ఊగుతూ దేవరను నిల్పుటకై ఆర్బాటము చేయుదురు. వారిని సివసత్తులు అని నేటికిని రాయలసీమలోను, తెలంగాణ మందలి బహుప్రాంతాలలోను అందురు.

తెలతెలవారువేళ పూర్వము దేవాలయములందు నగారా మ్రోయించెడి వారు. రాజుల భవనాలముందు మేలుకొలుపుల మంగళవాద్యము లెట్లో అట్లే దేవాలయములందును దేవునికి మేలుకొలుపులుగా నుండెను. "దేవనిలయ ప్రాంచన్మహామర్దల ధ్వనిచే వేగు టెరింగి"[3] జనులు వర్తించుకొంటూ వుండిరి.

         .....రంగశాయి గేహమ్మున బోరున న్మొరసె
         నప్పు డహర్ముఖసూచకంబులై యిమ్ముల శంఖదుందుభి సమా
         హిత మంజుల వాద్యఘోషముల్"
         అని విప్రనారాయణచరిత్ర (4-98.) లోను వ్రాసినారు.

పూర్వము వైష్ణవాచార్యులకు గ్రామాలపై కొన్ని హక్కులను అప్పటి రాజు లిచ్చియుండిరి. పెమ్మాసాని తిమ్మానయడు అను కమ్మదొర శా.శ. 1566 (క్రి.శ. 1644)లో ఒక శాసనము ఇట్లు వ్రాయించి యిచ్చెను.

"తాతాచార్యుల ప్రపౌత్రులయిన తిరుమల బుక్కపట్నం కుమార తాతాచార్యులవారికి ముసళ్ళ గోత్ర పెమ్మసాని తిమ్మనాయనింగారు వ్రాయించి యిచ్చిన దేశసమాచారపత్రిక-పూర్వంమీ తిరుమాళిఘెకు కృష్ణదేవరాయలనాటి నుంచి నడిచే దేశసమాచారం దేశం మ్లేచ్చాక్రాంతమై పోయినందున మా తిరుమాళిఘెకు నడిచే గ్రామాదులు వర్షాశనములు మాకు నడిపించమని ఆజ్ఞనేమిస్తిరి. గనుక తమ సన్నిధిలో మేము పంచ సంస్కారములు అయ్యే సమయమందు మా గోలుకొండ పాదుషావారు మనసబు యిచ్చిన గండికోటతాలూకా 4 లక్షల 50 వేల సీమకు హరిసేవ, గురుసేవ ముద్రకానికె గుడికట్నం బసివిముద్ర

  1. శుకసప్తతి. 3-583.
  2. శుకసప్తతి 3-116.
  3. శుకసప్తతి 2-356.