పుట:Andrulasangikach025988mbp.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           కుడుము రూకల కెల్ల గొననైతిగాయంచు
              బేర తేరని యూరివేర మొంద
           గొరియమందల నించుకొననైతిగా యంచు
              గొల్లవా డూరక కుళ్ళుకొనగ
           పెనుపసుపుపే విత్తుకొననైతిగా యంచు
              కాపు నిద్దురలేక కళవళింప
           మొనసి వెలచూపి చూపకమునుపె
              వారిసరకు లమ్ముడువోయె నేజాతివారి
           కేని పాటింపవలసి పేరెక్కినట్టి యా
              దినంబున నంబురుహాయతాక్షి"[1]

ఆనాడు పొంగలి చేసుకొనెడివారు. ఆ పండుగనాడు కొత్తకుండలు కొనుట, గొర్రెలనుకోసి వాటిమాంసము తినుట, మున్నగునవి చేయుదురని కవి తెలిపినాడు. కుడుము తప్పుపాఠ మనుకొందును. 'గుడము^' అంటే సరిపోవును. ఆ పండుగ కాలములో చింతకాయతొక్కుకై పసుపు వాడుదురు.

కాపువారికి ఏరువాకవలెనే 'వింతటిపండుగ' యనునది ముఖ్యమైనది. వింతటి అనుపదము నిఘంటువులలో లేదు. జొన్నలు విత్తునాడు చేయు పండుగ అని దానియర్థము. నేటికిని జొన్న విత్తనమునకు ముహూర్తముపెట్టి యీ పండుగ చేయుదురు. జొన్నవిత్తనము వేయునప్పుడు చేని వద్దనుండు రెడ్డిని, చేనివద్ద విత్తనముగింజల బిచ్చమును పొందు నిమిత్తమై గ్రామపురోహితుడు పోయెను.

          "వచ్చిన పెద్దరెడ్డి సుగవాసివి, మే లిపుడైన నీడకున్
           వచ్చితె యంచు బావయను వానిని ద్రస్తరలాడి, దాపడా:
           యిచ్చట జల్లు విత్తు ఫలియించునె వేళ గుణం బెరంగి నా
           యిచ్చకు మెచ్చుగా వదరు మిప్పు డనన్ విని యాత డుబ్బునన్"[2]

అతనికి ప్రీతియగు ముచ్చట్లుచెప్పి-యపుడు చేజేత దీసికొనియె పుట్టెడు విత్తులు" (పుట్టెడు=పుటికెడు=గంపెడు.)

  1. శుకసప్తతి. ఆ 2.
  2. శుకసప్తతి. ఆ 2.