పుట:Andrulasangikach025988mbp.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను కట్టించుటచేత శిల్పవృద్ధి యెక్కువగా నయ్యెను. రాజులు, జనులు, చిత్రలేఖనమును, కవితను, అద్దకమును సంగీతమును పోషించిరి. అచ్యుతరాయ కృష్ణరాయల కాలమందేకాక విజయనగర పతానానంతరము వేంకటపతిరాయల కాలమందును చిత్రకారులుండిరి. దేవాలయములయొక్కయు, భవనముల యొక్కయు గోడలపై చిత్తరువులు వ్రాయించిరి. అనంతపురము జల్లాలోని లేపాక్షి దేవాలయములోని చిత్తరువులు తర్వాతివారి తెలివితక్కువవలన చెడగొట్టబడినను మిగిలినవైనను చాలా సుందరమైనవి. అందు అచ్యుతరాయని కాలపు శాసనాలున్నవి. కప్పుపై చిత్తరుపు లున్నవి. స్తంభాలపై చక్కని శిల్పము లున్నవి. కాని తర్వాతివారు వాటిపై ఎర్రమన్ను సున్నము పట్టెలు వేసి తమచిత్రమును ప్రదర్శించినారు. అందు ఈశ్వరునికి సంబంధించిన సుందర చిత్రములున్నవి. విజయనగరరాజులే తంజావూరిలోని బృహదీశ్వరాలయము చిత్తరువులు వ్రాయించిరి. పీస్ యిట్లు వ్రాసెను.

"క్ర్ష్ణదేవరాయల అంత:పురభవనమందు రాజుయొక్కయు, వారి తండ్రియొక్కయు చిత్తరువులను గోడలపై వ్రాసినారు. అవి యారాజులను చాలా చక్కగా పోలియున్నవి. అచ్చటనే గోడలపై నానావిధజనుల యాకారములను తీర్చినారు. తుద కందు పోర్చుగీసు రూపులను కూడా దించినారు. అ చిత్తరువులు అంత:పురకాంతలకు ప్రాపంచిక జ్ఞానము కలిగించెడివి." బోగపుసానులయిండ్లలో కూడా సింహాలు, పులులు, ఇతర జంతువులు, అవి అచ్చముగా బ్రదికినవా అన్నట్లు చిత్రించి యుండిరి. అని అబ్దుర్రజాఖ్ వ్రాసెను. "గోడల చెలువార కృష్ణ లీలలు లిఖించి" అని ప్రౌడకవి మల్లన (1-118) వ్రాసెను.

రాయలనాటి కవితలోను, అందు ముఖ్యముగా రాయలే వ్రాసిన ఆముక్తమాల్యదలో ఆనాటి సాంఘిక చరిత్ర యిమిడినది. పాశ్చాత్యులవర్ణనలు మనకు లేకుండిన ఆ కవితలు ఊహాగానములనుచుండిరో ఏమో! ఆనాడు స్త్రీలుకూడా "శాస్త్రసరణి"గా "తూలి"తో చిత్తరువులు వ్రాసిరి.([1]) చిత్రలేఖినిని తూలి, వాగర లేక కుంచె యనిరి. దానినే సంస్కృతములో ఏషికా, తూలికా యనిరి. గోడలపై మంచిగచ్చుచేసి వాటిపై రంగురంగు చిత్తరువులు వ్రాసిరి. 'పూబోణి

  1. Salatore, II