పుట:Andrulasangikach025988mbp.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          వివిదంబులగు చిత్రవిరచనలును దసి
             లీ మాలుపట్టె యల్లిక బెడందు
          పలు తెరంగుల పట్టుతలగడ బిల్లలు
             మవ్వంపు కుంకుమపువ్వు పరపు
          గలిగి మెరుగలు దిక్కుల గడలుకొనగ
             మించు టద్దపు టుయ్యెల మంచమునను
          బొలుపు మీరుచు దన యంతిపురము
             సతులయూడిగంబులు గైకొంచు నున్నశౌరి'[1]

కొందరు పావలు (సమ్మాళిగలు) తొడిగిరి. జనులకు నిలువుటద్దాలు, చేతి అద్దాలుండెను, ఆచారపరులవి మట్టివని కంచుటద్దాలను వాడిరి. కంచును బాగాతోమి దానిలో చూచుకొనిరి.[2] జనులు ధనము జాలెలను (వల్లువము, వల్లము) నడుమున కట్టుకొనిరి.[3]

బీదజనుల యిండ్లు పూరికప్పులవై యుండెను. మట్టిమిద్దెల యిండ్లును వారికుండినట్లు ఆముక్తమాల్యదలో సూచితిమి. "మట్టిమిద్దెల వారికి నిదురు చెడియె" (ఆము. 4 - 123). భోగమువారి యిండ్లే జనుల యిండ్లపైకి వైభవోపేతముగా నుండెనని విదేశి యాత్రికులు వ్రాసిరి. వారు చాలా ధనవంతులనియు, వారి యిండ్లు ఉత్తమముగా నుండెననియు పీస్ వ్రాసెను.

జనుల ఆచార వ్యవహారములు

మల్లయుద్ధాలు, కుస్తీలు జనులకు ప్రీతి. మల్లయుద్ధాదికల దృష్ట్వా[4] అని యొకడు వ్రాసెను. జనులు సాధారణముగా కంచు పాత్రలలో (కంచాలలో) తినిరి.[5]

మరులు తీగెను తొక్కితే బాట తప్పుదురని ప్రజలు విశ్వసించిరి.

  1. ..... ..... ..... 2 - 15.
  2. ఆముక్త మాల్యద. 4 - 180.
  3. ప. యో. విలాసము. పు 503, ధర జాలెతో దూడ దన మిచ్చినట్లె'
  4. ఆకాశ భైరవకల్పం
  5. ఆముక్త మాల్యద. 4 - 128.