పుట:Andrulasangikach025988mbp.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాసరులు "సందె గోపాలభిక్ష"చే జీవించిరి. సందె వేళలో గోపాల కీర్తనలతో యిండ్లవద్ద బిచ్చ మెత్తుకొనుటను సందె గోపాలమనిరి.[1]

బ్రాహ్మణులు విద్వత్తుచేతను, వైదిక వృత్తిచేతను జీవించెడివారు. దేవాలయములందు అర్చకులుగాను, పౌరోహితులుగాను, జ్యోతిర్వేత్తలుగాను జీవించిరి. వారికి దేవాలయ సత్రములం దుచితముగా భోజనము లభించెడిది. ఈయాచారము నేటికిని తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థాలాలలో కానవస్తున్నది. వారి కానాడు ప్రతి శనివారము శిరస్స్నానానికై నూనె పిండి కూడ యిచ్చెడివారు. వ్రతాలకు కొదువ లేకుండెను. నానావిధ దానాలను, అందు ముఖ్యముగా షోడశ దానాలను, వారికిచ్చు విషయములో హేమాద్రి యొక గొప్ప గ్రంథమునే వ్రాసి యుంచెను. అది ప్రమాణ గ్రంథ మయ్యెననియు, రెడ్డిరాజులు హేమాద్రి ప్రోక్తదానాల నన్నింటిని చేసిరనియు తెలిపినాము. గ్రహణ సంక్రమణ కాలాలలోను, రాజులకు గ్రహశాంతి యవసరమైనప్పుడు బ్రాహ్మణులకు దానాలు చేసిరి. "అబద్ధంబులాడి చిల్లర ప్రభువులన్ భ్రమియించుచుండి, దీక్షితులంజూచి యియక్షవొడిమి ద్రవ్యాభిక్షార్థినై మధురకుం బోయి యప్పురంబున"

         "బహివడ్డ ద్విజున కల్పపు పాచితం బిడి
             పసిడి కైతా వానిబంతి గుడిచి
          కలిబ వణిక్పురోధులతోడ బుణ్యాహముల
             బియ్యములకునై మొత్తులాడి
          శశి రవిగ్రహ జపస్నానాదికము లెల్ల
             దొరల వాకిండ్లకే దొద్దయిచ్చి
          పచ్చిర్రితో ల్బర్రెచుచ్చాల మెట్లంది
             కొనదాన యూరెల్ల గుత్తపట్టి
          దర్బపోటుల దిని లేనితరుల మైత్రివంటి
            పితృ శేషము భుజించి యదియు నెడల
          అక్కవాడల నరకూళ్ళు మెక్కిమీద
            వీరశేఖర మొకత లార్త్విజ్యము కొని"[2]

ఆనాటి పురోహితులు జీవించిరి.

  1. ఆము. 4 - 35.
  2. ఆముక్తమాల్యద 3, 4, 5.