పుట:Andrulasangikach025988mbp.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోగమువారి వేషా లిట్లుండెను:-

వలిపె చెంగావి పావట, వెలి పట్టుచీర కట్టి, జవ్వాది పూసుకొని, చంద్రకాంతపు దువ్వెనతో నెత్తి దువ్వుకొని, జారుకొప్పు వెట్టి, అణిముత్యాలచేర్లు కంఠమున ధరించి, పచ్చవ బొట్టొనరించి, గుమ్మడిగింజ (వంటి) నామము దీర్చి, తాటంకములుదాల్చి, మొదపుతీగెకు (హార ముఖభాగము) చెంత ముత్తెపుబలుకు పెట్టి, పుంజాలదండను, నేవళము (మణులహారము) వేసుకొని, బన్న సరములు దాల్చి, చేతులలో మురువులు కంకణములుదాల్చి, ముత్యాల చేకట్లు కట్టుకొని, సందిదండలు, నెలవంక తాయెతులు, ఉంగరాలు, మణులు యొడ్డాణము, బిల్లల మొలనూలు బంగారు సరపణి (గొలుసు), మణినూపురములు బోగము స్త్రీలు ధరించెడివారు.[1]

బోగముసానుల వద్దనుండు దాసి వేష మిట్టిది:-

నల్లపూసలపేరు, బండి గురిగింజ, తావడములు (హారములు), పవదంబు చేకట్లు, పిత్తడి కడెములు, పికిలిపాదండలు, నల్లముదుక గాజులు, లక్క తాయెతులు, తెల్లని తగరంపు ముక్కర, సీసపు ముద్దుటుంగరము, కాకి బేగడ బొట్టు, కంచుమట్టియలు, శంఖు ఉంగరము, ఇవి దాని యాభరణములు.[2]

ఆ నాటి స్త్రీలు సాధారణముగా ఈ క్రింది భూషణముల ధరిస్తూ వుండిరి:-

         "తలుకు బిల్లాండ్లు బబ్బిలి కాయలును మ
             ట్టియలు వీర మద్దెలు సందియలును
          మొలనూళ్ళు, వొడ్డాణములు, నేవళంబు
             బుంజాలదండయు బన్నసరము మొగపు
          దీగయు నాణి ముత్తెపు బేర్లు సందిదండలు
             సూడిగములు గౌడసరములును
          కడియాలు పెక్కుజోకల యుంగరములు
             ముంగరయు గోలాటంపు గమ్మజోడు

  1. పరమయోగి విలాసము, ద్విపద. పు. 273-4.
  2. పరమయోగి విలాసము, ద్విపద. పు. 323.