పుట:Andrulasangikach025988mbp.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యయము తీసివేసి మిగిలినదానిలో కొంర కోరును ప్రభుత్వానికి చెల్లించువారు.

         "ఉమ్మడియును: ఠాణె, యుత్తరు వమర మిమ్మెడియింప మాకియ్యేటి
          వరకు చెల్లిన ధనమెంత"[1]

ఉమ్మడియన సేవ. రాజసేవకై యిచ్చిన ఇనాము. ఠాణెయన భటుల సిబ్బందియుంచుట. ఉత్తరువు అనునదియు ఒక విధమగు పాళెపు సేవ. అమరము అనునదియు అట్టిదే.

అమరమును గూర్చి కృష్ణరాయ విజయందిట్లు నిర్వచింపబడినది.

         "భటులు వేయిటికెన్న, ఇర్వదియు నాల్గు
              వేలుగా, లక్షయిర్వదివేల పజకు
          చెల్లు నల్వదిలక్షలు జీత మనఘ
              అమర మేలెడు దొరల కీక్రమమె సుమ్మి"

"ఉత్తరువు ఉమ్మళియు త్రోయంగ మరియు నందులకు నిందులకుపోయె పొమ్మని వాం బులిమిపుచ్చుటయు గనలి భూపతి బోడుకలు కొంగుబట్టిపెంచి రాదిగిచి యీడ్చుటయు"[2] గుంపించి అనుటచే రాజులకు రావలసిన భూభాగము రాకున్న రాజసేవకులు వారి నవమానించెడివారు. (బోడుకలు పదమునకు మారుగా బోడికలు అని శ. ర. లో కలదు.) పన్నులు చెల్లించనివారిని,

         "పడతాళ్ళ చేద దీర్పరుల మన్నీల తడయక పిలిపించి తద్వార్త చెప్పి"[3]

శిక్షానిర్ణయము చేసెడివారు. (పడతాలు శబ్దములు శ.ర. నిఘంటువులొ లేదు. సందర్బమునుబట్టి భటుడనియర్థము.) శ్రీ రాళ్ళపల్లి అనంతశర్మగారు పడవాలు అను పదమును తెలిపినారు. అపుడు భటుడనుట సరిపోయినది. మఠియు 'గురియగట్టి' వారిని ఈడ్చుకొని పోయెడివారు. బండలెత్తి, ఎండలో నిలబెట్టి చేతులకు కాళ్ళకు సంకెళ్ళు వేసి బాధ పెట్టెడివారు.

  1. పరమయోగివిలాసము ద్విపద పు 458
  2. పరమయోగి విలాసము పు 461.
  3. పరమయోగి విలాసము పు 457