పుట:Andrulasangikach025988mbp.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          బలువైన కేలి యంబటికుండ తనకు
             నలవడ నలగొండ లన నొప్పుచున్న
          మీటైన యెద్దులు మెడ కాడిమీద కోటేరువైచి
             నెక్కొని రొప్పికొనుచు చనుదెంచె"[1]

(కాళి కాక కాసె అయియుండును.) వరిమళ్ళలోని వరిపంటలు సమృద్ధిగా నుండెను. కొన్ని వడ్లపేర్లను రాయలిట్టు తెలిపినారు. "తీగమల్లెలు, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడిగుత్తులు, కుసుమములు, సంపెగలు, పచ్చ గన్నెరలు, పాళలు, రాజనములు"[2] ఇంతవరకు రెడ్ల, కాపుల, వ్యవసాయమును గురించి వ్రాసినాము: ఇక ఇతర జాతులవారిని గురించి తెలుసుకొందమ.

కరణము వేషమెట్టిదనగా:-

       "వనముంచు తెలివలిపంపు పింజియులు పొసగ చుట్టినయట్టిబోడకుల్లాలు
        చింపికుప్పసములు చెవిదోరములను నంపుటంబులతోడ జంపాడు నొడలు
        బిగువగా చెంపదోపిన బలపముల తక నలవడ వత్తరి
        కరణికులు చనుదెంచిరి."[3]

(బోడకుల్లాలు=చిన్నటోపీలు. కుప్పసములు= కుబుసములు (అంగీలు) సంపుటము అన ఒకవిధమైన బట్టపలక. పూర్వము బట్టపై లేక కాగిదాలపై నల్లని గార (coating) పూసి యెండించెడివారు. ఆ యట్టలను రెండుమూడు కలిపి యుంచుకొని వాటిపై మెత్తని కోపు బలపముతో వ్రాసి తుడిచికొని మరల మరల వ్రాసెడివారు. బట్టకు రెండుప్రక్కల కాగిత మంటించి దానిపై ఆకు పసరు, బంక, బొగ్గు నుసి పట్టించి పలకవలె చేసికొని దానిపై కోపు బలపాలతో వ్రాయుచుండిరి. కరణాలు అట్టి సంపుటాలను పట్టుకొని కోపు బలపాలను చేవులపై నుంచుకొనిపోయిరి. "ఆ కాలమందు నల్లని బట్టపై బలపముతో వ్రాస్తుండిరి," అని బి. సూర్యనారాయణగారు వ్రాసినారు. కరణాలు వ్యవసాయపు పన్నుల లెక్కలు వ్రాయువారు. అ కాలములో భూములు శాశ్వత పట్టాపై యియ్యకుండిరి! కొందరు కలసి కోరుకో పన్నుకో చేతనైనంత భూమిని తీసుకున్నట్లున్నది. మండలాధికారులు భూములను పొంది అందు తమ సేవకైన

  1. పరమయోగి విలాసము. పు 531.
  2. ఆము 1 - 66.
  3. పరమయోగి విలాసము ద్విపద. పు 458.