పుట:Andrulasangikach025988mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయాలు విశేషముగా తెనుగుదేశములో పూర్వము ప్రచారమం దుండినట్టివి. పరిశోధన చేసి వాటిని సమకూర్పకుండిన ముందుకాలమువారికి మన సాంఘిక చరిత్ర లర్థము కానేరవు.

ఈగ్రంథ ముద్రణాదులను, ప్రూపులను సరిచూచి విచారించుకొన్న మిత్రులగు శ్రీ దేవులపల్లి రామానుజరావు, బి.ఏ., ఎల్‌ఎల్.బి. గారికిని, శ్రీ పులికాల హనుమంతరావుగారికిని మరల నా మన:పూర్వక కృతజ్ఞతలను సమర్పించుకొంటున్నాను.

ఇందు సిడి పటమును ముద్రించినాము. దానిని సంపాదించి యిచ్చిన శ్రీ కే. శేషగిరిరావు (ప్రసిద్ద చిత్రకారులకు) గారికి నా కృతజ్ఞతలు.

ఇకముందు ఈ సాంఘిక చరిత్ర పూర్వాభాగమును శాలివాహనుల కాలమునుండి రాజరాజ నరేంద్రుని కాలమువరకు వ్రాయుటకు పూనుకొందును.

అక్టోబరు, 1950

సు. ప్రతాపరెడ్డి