పుట:Andrulasangikach025988mbp.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామంతుల యొక్కయు, రాచవారి యొక్కయు ఉడుపులను బార్బోసా యిట్లు వర్ణించెను. "వారు నడులము దు కాసె కట్టెడు వారు చాలా నిడుపుకాని చిన్నవి సన్నని నూలు అంగీలు దొడిగిరి. లేదా పట్టు అంగీలు తొడిగిరి. ఆ యంగీలు ముందు భాగమున విడుచుటకు కట్టుటకు ననుకూలముగా నుండెను. దానిని తొడల సందున దూర్చి కూర్చొనుచుండిరి, నెత్తులపై చిన్న రుమాలలుండెను. కొందరు పట్టు జరీ టోపీల ధరించిరి. వారు చెప్పులుకాని ముచ్చెలుకాని తొడిగిరి. భుజాలపై పెద్ద పెద్ద దుప్పటంతటి సెల్లాలను వేసుకొనిరి. వారి స్త్రీలు చాలాసన్నని తెల్లని నూలు చీరలనుగాని, రంగురంగుల పట్టుచీరలనుగాని అయిదుగజాల పొడవుకలవి కట్టుతూ వుండిరి. (ఇప్పటివలెనే కట్టు చుంగులు కొంగు వేసుకొనిరి.) పట్టుతో జలతారుతో కప్పిన ముచ్చెలను తొడిగిరి"[1]

"విజయనగర చక్రవర్తులు ఊరపిచ్చుకలు ఎలుకలు, పిల్లులు, బల్లులు, కూడా తినిరి" అని నూనిజ్ అనే విదేశ యాత్రికుడు వ్రాసెను. నేటికిని పరమ నీచులును మన దేశ మందెందును పిల్లుల, బల్లుల తినుటలేదుకదా! ఇక ఆ చక్రవర్తులకు ఉత్తమమైన కోరినట్టి రుచ్యమైన మాంసము దొరకక యీ యసహ్య మాంసములను తిని రనవలెనా ? ఇది పచ్చి అబద్దము. పాశ్చాత్యులు తెలిసీ తెలియనిపిచ్చివ్రాతలను కూడా వ్రాసి పెట్టిపోయినారు. అవి విస్సన్న వేదమువలె గ్రాహ్యములు కానేరవు.

సామాన్య జను లెట్లు జీవించిరో కనుగొందము. సాధారణ జనులలో ముఖ్యులు రెడ్లు. కొండవీటి రెడ్డిరాజుకు విజయనగర చక్రవర్తి కన్యకనిచ్చి పెండ్లి చేసియుండియు నిరంతరము రెడ్డిరాజులకు విజయనగర చక్రవర్తులకు యుద్ధాలు జరిగెను. తుదకు రెడ్డిరాజ్యము పడిపోయెను. సామ్రాజ్యములోని రెడ్లు గ్రామాధికారులుగను, వ్యవసాయకులుగను, సైనికులుగను జీవనము గడిపిరి. శ్రీకృష్ణరాయలు వారిని తన ఆముక్తమాల్యదలో రెండు మూడు మారులు తడవెను. "విడువ ముడువ వేపరని వీసంబుగల రెడ్డి"ని పేర్కొనెను. దుప్పటి కొంగులో బీదవారు కాసువీసము ముడి వేసుకొని అత్యవసర మైనప్పుడు కూడా విడువలేక విడిచి వాడుకొందురు. పేదవారికి వీసమే ------ కోశము. రెడ్లు తమచేలవద్ద గుడిసెలు వేసికొని మంచెలు వేసికొని పిట్ట ------

  1. V. S. C. P. 227.