పుట:Andrulasangikach025988mbp.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తక్కువగా నుండునా? వారు వివిధాయుధములను చేయుటలో నారితేరినవారు. మహారాజులు, సామంతులు దేవాలయములను, సత్రములను, భవనములను, కోటలను నిర్మించినందున కాసె వారికి పని తక్కువకాకుండా యుండెను.

వస్త్రములకు దేశిరంగులు వేయువారుండిరి. వారు ప్రధానముగా నీలిరంగును వాడిరి. మంజిష్ఠ, ఇంగిలీకము, కరక్కాయ, మున్నగునవి వాడిరి. "ఇంగిలీకంబునన్ తడిపి యెత్తు కసీసపు రెంటములు" జనులు వాడిరి. (చూ.అము. 4-10.)

ప్రజాజీవన విధానము

విజయనగర సామ్రాజ్యమం దాంధ్రులది పై చేయిగా నుండినది. ఆంధ్రదేశము మహావైభవముతోను. ఐశ్వర్యముతోను నిండియుండెను. ఆంధ్రు లుత్సాహవంతులై కళాపోషకులై దేశాంతరములందును ప్రఖ్యాతి గాంచిరి. అది మంచి చెడ్డలతో నిండిన ప్రబంధ యుగము. సుందర నిర్మాణములు, చిత్రలేఖనములు, ఇతర శిల్పములు దేశమంతటను సువ్యక్తము లయ్యెను. ధనికుల భోగలాలసత ఇదే కాలమందు విజృంభించెను. విద్యానగరము హృద్యనగర మయ్యెను. అందులోనే బావిపతన సూచన లిమిడి యుండెను. జనుల యిండ్లు, వారి యుడుపులు, వారి వేషములు, అలంకరణములు ఆచారవ్యవహారములు మనకు బాగుగా తెలియ వచ్చినవి. మొదట రాజులయొక్కయు, రాచవారి యొక్కయు జీవన విధానములను గురించి తెలుసుకొందము. వారికి అలంకరణములందు అభిమానము మెండుగా నుండెను.

          "పన్నీటితో గదంబము సేసి పూసిన
              మృగనాభివస రాచనగరు దెలుప
           పాటలానిలము లార్పగ దపారపుజుంగు
              లలరు దానికి మూగు నళులజోస
           కర్ణడోలామౌక్తికచ్ఛాయ లెగబ్రాకు
              నురుహారరుచుల ద్రస్తరికి దన్న
           శశికాంతి చెంగావి దశ మలచిన కేల
              స్వర్ణత్సరుపు వాడివాలు మెరయ