పుట:Andrulasangikach025988mbp.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"చెవుల సంకులు, కొంకిసిగలు, కావిదుప్పటులు నొప్ప, గంధకలనా కుసుమ వ్రక్ గ్రథనాదుల సాంధ్యంబు లేకలరు ఆంధ్రదేశీయులగు గంధకారులు"[1]

అనుటచే ఆంధ్రదేశమందే పూలదండలు కట్టి, సువాసన వస్తువుల సిద్ధముచేసి, బుక్కాపిండిని (పిష్టాతకము) చేసి అమ్మి జీఎంచువారుండి రనుట స్పష్టము. కొల్లలుగా బోగముసానుల యిండ్లు గల విజయనగరములో గంధ కారుల కొదువయుండునా? ఆ బుక్కావారు "పన్నీరునించిన తన్నీరు తిత్తులొత్తిరి." వారు తన్నీరు (తుపు+నీరు=చల్లని) పన్నీరును కూడా సిద్ధముచేసి తోలుతిత్తులలో పోసి యమ్మెడివారు.

తెనుగుసీమ ప్రాచీనమునుండి వజ్రాల గనులకు ప్రసిద్ధి నొందినట్టిది. గుత్తికి 20 మైళ్ళ దూరమునున్న వజ్రకరూరు ఇంగ్లీషువారు దేశాన్ని గెలిచిన కాలమందు కూడ వజ్రాలకు ప్రసిద్ధి గన్నట్టిది. గుత్తి దుర్గాధీశు డచ్చటి వజ్రాలను చక్రవర్తుల కంపుతూ వుండెను.[2] ఇట్టి గనులు మరిమూడు నాలుగుండెనని ఆ కాలపు యాత్రికులు వ్రాసినారు.

కంసలి, కమ్మరి, కంచరి, కాసె, వడ్లవారి వృత్తులు నిండుగా ఉండెను. వీరిని పంచాణమువారు (శిల్పులు) అని పేర్కొనిరి. నేటికిని పల్లెలలో పంచాణ పదమును "పాంచాలి" యని యుచ్చరించి వడ్ల, కమ్మరి, కంసలివారలను పాంచాలివారని యందురు. వడ్లవారిని, కంసాలివారిని పంచాణము వారనుటకు

        "సారెకు నచటి పంచాణంబువారి జేరి ..... ..... ..... ......
         గుడిసొచ్చి చోరులు కొంపోయిరకట యనుచు కంసాలివా రనిశంబు
         వినగ అనుచుండు"[3] అనుట ప్రమాణము.

సాధారణ కాలమందు 10 లక్షల సైన్యము కలిగి అవసరమైనప్పుడు 20 లక్షల సైనికుల వరకు కూర్చగలిగిన సామ్రాజ్యములో కమ్మరివారికి పని

  1. ఆముక్తమాల్యద 4-35.
  2. V. S. C. P. 218.
  3. పరమ యోగి విలాసము పు 5-23.