పుట:Andrulasangikach025988mbp.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          అనించి బేహారమాడగ నటకు వానికై
             చను దెంచు వారల వాని
          బూని బేహార మాడి పోవువారలును"[1]

ఆ కాలమందు దిగుమతులగు వస్తువులను సమకాలికులు తెలిపిన వన్నియు ఇందు కలవు. పైగా చంద్రాననా మణుల (అందగత్తెల) వ్యాపారము కూడ జరిగెను. ఈబేరము రెడ్డిరాజ్యకాలములోను జరిగినటులు ఆ కాలపువారు తెలిపినారు. పరదేశముల సెట్లవేష మెట్టిదనగా:-

         "పరదేశముల సెట్లపగిది దిండుగను పెల్లుచుట్టిన పెద పెద ముడాసు
          లును డొల్లుబొంగులును నీటుగ పొందుపరచి పొదిగల్గు అసిమల భుజ
          ములం బూని వదలుగారింటెముల్ వలెవాటువైచి."[2]

ఇందు డొల్లుబొంగులు తప్పు. డొల్లుపోగులు అని యుండవలెను. అనగా ఊగునట్టి పోగులని యర్థము. (ముడాసు పదము నిఘంటువులలో లేదు) "ముడాసుపై లపేటాడబ్బు" అని శుకసప్తతిలో వర్ణించుటచే ముడాసు అన టోపి అని యర్థము. ముడాసు కన్నడ పదము. కోణాకారముగల చక్కని బట్ట, టోపిపైలపేటా-షమ్లా-రుమాల కట్టుట నేటికిని ముసల్మానులలో ఆచారమైనది. అసిమి, అసివి, అశ్విసంచులు మూరెడు వెడల్పు గజముపొడవు కలిగి నిలువు మధ్య దుందు జేనెడు పంమగలిగి కుట్టిన గోనెసంచి, ఆ సంచిలో రెండుమూలలో వస్తువులనుంచి వీపున ఒక మూల ఎదపై ఒక మూల పడునట్లుగా భుజముపై వేసుకొందురు. ఎద్దుపై లేక అశ్వముపై ఎక్కినప్పుడు దానిని గంతవలె వేసుకొని పోదురు. గుర్రాలపై నెత్తుధాన్యాదుల సంచులగుటచే అసిమి లేక అసివి సంచులని వాటికా పేరు వచ్చియుండును. ఇవి నేటికిని పల్లెలలో కోమట్లవద్ద అందందు కాన నగును అసిమిని మాత్రసంచి యనియు అనిరి. ప్రయాణములో అది తలగడగా పని యిచ్చెడిది.[3] రింటెములు అనునది సరికాదు. రెంటములు అనునది సరి. (రెండుపోరువల దుప్పటియని యర్థము.)

  1. ద్విపద పరమయోగి విలాసము పు 486.
  2. ద్విపద పరమయోగి విలాసము. పు 487.
  3. ఆముక్త మాల్యద. 2-74.