పుట:Andrulasangikach025988mbp.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         "తక్కటి సెట్లు నాతలి బిలిపింప
          జేరి కోమటి బాస జెప్పె" పట్టింపు
          భూరాము సల్లెడు భూరాము లొండె
          మరికెంబు బోడ దమ్మని నొండెనతని
          దరిమి గాలము త్రాటదమ్ముల నొండె
          మలుచంపు బుడుగుల మాసల్లె డొండె
          మలయక కాలము మాసల్లెడైన
          వెలకుల నొండేను వెస చెర్వులోన
          దిలకింత మనుచు చింతింపుచున్నాడు."
____నవనాథ, పు. 276,

        ఈ బాస కర్థము చేసుకొన ప్రయత్నించుట పనిలేనిపని.

క్రీ.శ. 1336 లో హరిహరరాయలు పన్ను చెల్లించువారు 1 రుపాయకు 34 సేర్ల ధాన్యమిచ్చునట్లు నిర్ణయించెను. దీన్ని బట్టి ధాన్య మెంత చౌకగా నుండెనో తెలియగలదు.

ధాన్యం తూకములు, సోల[1] తూము[2], ఇరుస, మానికె మొదలగు మానములలో జరుగుతూ వుండెను.

     ఓడ రేవులలోని బేరమును గూర్చి యిట్లు వ్రాసిరి.

         "అటకు మిక్కిలి చేరు దగు పయోరాశి
              తట సమీపమున నిత్యంబు నోడలును
          పచ్చ కప్పురమును పట్టుబట్టలును పచ్చి
              కస్తురి మేల్మి పసిడి యిట్టికెలు
          మణులు చంద్రాననామణులు పటీర
              కణములు మొదలుగాగల వస్తువులును
          నిరవొంద నెన్నిక కెక్కు బేహరులు
              హరుల రంతుల తోరహత్తుగా దెచ్చి

  1. ద్విపద పరమయోగి విలాసము, పు 69.
  2. ద్విపద పరమయోగి విలాసము. పు 480.