పుట:Andrulasangikach025988mbp.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండిరి. కల్తీ వెండి బంగారు నాణెములను గుర్తించుటకు కమసాలులు నియుక్తులై యుండిరి. కవుల రచనలలో ఈక్రిందివి పేర్కొనబడినవి.

మినుకు, [1]కాసు, [2]మాడలు, [3]వీసము, [4]అప్పటి నాణెములలో వరహా అన్నింటికన్న పెద్దది. కాకతీయులకు వరాహము, , దాని ముందు ఖడ్గము రాజచిహ్నముగా నుండెను. దానినే విజయనగర చక్రవర్తులు స్వీకరించిరి. వరాహ చిహ్నములతో ముద్రించిన బంగారు నాణెములను వరహాలు అనిరి. వాటిని టంకసాలవాటు లనియు వ్యవహరించిరి.[5]

             చిన్నము, తారము అనునవి వెండినాణెములు.

        "శిబికొని పోడొక్క చిన్నమైన న్యాయార్జితము తారమైన లెస్స"[6]

దొంగనాణెములను పరీక్షించుటకై కమసాలులేకాక బచ్చులుకూడ ఏర్పాటై యుండిరి.[7] ప్రజలు కోమట్లవద్ద తమ ధనమును వడ్డీ కిచ్చి దాచుకొనిరి. అనగా కోమట్లే ఆకాలపు బెంకులు. పలుమారు వడ్డీలెక్కలవద్ద తగవు లేర్పడి అల్లరులుచేసి తుదకు రచ్చచావిడికి వెళ్ళి ఇచ్చి పుచ్చుకొన్న వారు తమ తగవుల పరిష్కరించుకొంటూ వుండిరి.

        "ఇట్లొనగూర్చి వైశ్యునకు నిచ్చి, చనన్ మరి పుచ్చి చౌకముల్
         వెట్టుచు, వడ్డీలెక్కలటు వెట్టుచు ధారణవాసికై కొదల్
         వెట్టుచు, వాడు రేగి మరి పెట్టుదు పెట్టుననంగ, మిట్ట గూ
         పెట్టుచూ నిట్టు పోర గనిపెట్టుచు నొక్కరు డుండి వెండియున్."[8]

  1. పరమయోగివిలాసము - తిరువేంగళనాథుడు. పుట 98.
  2. "ఒక కాసు చెల్లింపకున్నాడు" చిన్న రాగినాణెము. పరమయోగి విలాసము. పు 457.
  3. పరమయోగి విలాసము. పు 480.
  4. ఆముక్తమాల్యద. 3 - 4.
  5. ఆముక్తమాల్యద 2 - 85.
  6. నీతి సీసపద్యములు - తాళ్ళపాక తిరుమలయ్య.
  7. ఆముక్తమాల్యద. 4 - 269.
  8. ఆముక్తమాల్యద. 6 - 6.