పుట:Andrulasangikach025988mbp.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవి రెండంగుళముల పొడువుండును. నాలుగు కొనలుండును భూమిపై వాటిని యెటు వేసినను సరే మూడు పాదాలపై నిలిచి నాల్గవపాదము పైకి లేచి యుండును.

అవి దబ్బనమంత మందముగ నుండును. వాటిని లక్షలకొలదిగా సిద్ధముచేసి శత్రువులు దాడిచేయువేళ కోటచుట్టును చల్లి నడిచెడివారు. శత్రువుల గజ తురగములుకాని, కాల్బలముకాని వేగముగా రాకుండుటకై రాత్రి కాని లేక పగలు చూచుకొనక కాని నడిచిన ఆ సూదులవంటి ముళ్ళు శత్రు సైన్యమునకు నష్టము కలిగించెడివి. ఇది అపూర్వపద్ధతి. ఇట్టివి మరెక్కడను చూడలేదు. మన వాఙ్మయమందును వాటి జాడలు లేవు. బహమనీ సుల్తానుల యుద్ధతంత్రములో నీ లగన్‌ముళ్ళు కూడా చేరియుండెను.

విజయనగర రాజులకాలమందుండిన చింతలపూడి యెల్లనార్యుడు తారక బ్రహ్మ రాజీయములో అచ్యుత దేవరాయలను కీర్తించినాడు. అచ్యుతునివద్ద నంజ తిమ్మయ యనునతడు "గ్రంథాసార లేఖకుడై" మంత్రియై యుండెనన్నాడు.

           "ఆ రాయల కృప గ్రంథా
            సారము వ్రాయుచును కీర్తి సంపాదించున్
            ధీరగుణాడ్యుడు, కందా
            సారము నంజరుసు తిమ్మ సచివుడు సిరలున్"

కందాసారము లేక గ్రంథాసారము అన మిలిటరీ లెక్కలు అని పీఠీకా కారులగు శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు వ్రాసినారు. ఇది స్కంధావారము నుండి ఏర్పడియుండునన్నారు. సైన్య సంబంధమగు లెక్కలు వ్రాయుట గొప్ప పదవిగా భావింపబడు చుండెను.

నాణెములు

విజయనగరరాజ్యములో చాళుక్య కాకతీయ నాణకపద్ధతి కొన్ని మార్పులతో ప్రచారమందుండెను. వెండి, బంగారు, రాగి నాణెములు వ్యాప్తిలో నుండెను. రాజులేకాక సామంతులును నాణెములను ముద్రించు సెలవును పొంది