పుట:Andrulasangikach025988mbp.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును చూచినవారు ఆమె రూపు రేఖలను పూర్తిగా చూచిన మరెంత అందముగా నుండునో అని అంచనాలు వేసుకొని ఆశ్చర్యపడసాగిరి. రాజు భార్యకూడ ఒక అందలములో బయలు దేరెను. ఆమె పల్లకి వెంట పట్టె నామములతో శ్రీవైష్ణవాచార్యు లిద్దరు రాఘవాష్టకమును చదువుచు వెళ్ళిరి. ఆ రాణిని సేవించు స్త్రీలు పలువురు కాళంజి, యడపము, తాళవృంతము, కండి, కుంచె, వింజామరలతో సేవలు చేయుచు వెళ్ళిరి. ఆరాణియొక్క భద్రతకై ఆమెపల్లకీలో ఆమె సోదరుడు కూర్చునెను. ద్విపదలను పాడి, కతల చెప్పు పట్టెనామాల శ్రీవైష్ణవులు వెంట వెళ్ళిరి. మరియు రాజాంత:పుర స్త్రీల రక్షణకై రాచవారు కొందరు వారి వెంట వెళ్ళిరి. పెసరకాయ, దోస, చెఱకు, సజ్జ మున్నగు పంటలను లాగి తినుచు సైన్యము వ్యవసాయకుల భూములను బీళ్ళుగా చేసి పోయిరి. గుర్రాలు వరిచేలను నుసిగా త్రొక్కి పోయెను. రథముల వలన, ఏనుగుల వలన పంటచేలు నాశనమయ్యెను. కాపులు అందుకై దు:ఖించిరి. ఈవిధముగా సైన్యము "కూచి" (March) చేసెను. శరత్కాలమందు సైన్యము బయలుదేరెను. వారు రాత్రులందు మంచుకు తాళలేక అడుగున బందారాకు పరచుకొన దుప్పట్లు నిండుగా కప్పుకొన్నను చలికి వడవడవడికిరి. సైన్యపువ్యయములను వ్రాయనట్టి కరణాలు సైన్యమువెంట వెళ్ళిరి. పలువురు బోగము స్త్రీలు సైన్యమువెంట వెళ్ళి సైనిక విటులవద్ద "రూకలు పది యైదు నిద్దురకు" లాగిరి. ఈ విధముగా యువరాజు యుద్ధయాత్ర వెడలెను. (చూడుడు 2వ ఆశ్వాసము)

ఇదే రాజవాహన విజయమందలి పంచమాశ్వాసములో యుద్ధవర్ణన చేసినారు. దాన్నిబట్టి కొన్ని వివరాలిట్లు తెలియవచ్చెడి. "దుర్గముల పాలెగాండ్లైన కమ్మవారును, వెలమవారును, 5000 వరహాల జీతము పొందు పఠాను సైన్యపు సేనానులు, కై జీతపు రాచవారు, "పగటి గానంబు తప్పక యుండ దినరోజు మాదిరి నొంటరి బోదుమూక" మొదలైన వారు యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు శత్రువులు "గడలపౌజు" కకావికలయ్యెను. తుపాకీలను కాల్చు మూక ఒక దిక్కు వాటిని శత్రులపై కాల్చిరి. గజసేనను కోట తలుపులు పగుల గొట్ట పురి కొల్పిరి. బాణములను కొందరు రువ్వుచుండిరి. కోట గోడలవద్ద గసులు త్రవ్వి మందునింపి కాల్చుచుండిరి. దానిని కోటలోనివారు భగ్న పరచుచుండిరి. కొందరు నిచ్చెనలతో కోటగోడ లెక్కుచుండిరి. కోటలోనివారు వారిని కూల