పుట:Andrulasangikach025988mbp.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దంతపు కొమ్ములకు పెద్ద ఖడ్గములను కట్టి యుండిరి. గుర్రపు సేనలో పఠాను లెక్కువగా నుండిరి. వారు జుంపాలకు నూనె పూసి దువ్వి మెరుగిచ్చి వాటిపై జరీపాగలు చుట్తిరి. అంగీలు దొడిగిరి. అంగీపై నడుములో దట్టీలు బిగించిరి. రూందే (తుర్కీ) దేశములో సిద్ధమైన రూమీ కత్తులు పట్టియుండిరి. వారికి రాగివన్నె మీసాలుండెను. కండ్లు ఎరుపై యుండెను. తాంబూలములు నమలినందున వారి నోళ్ళెర్రబారి యుండెను. వారు గుర్రాలపై బారులు తీరి యువరాజునకు సలామందించిరి. తర్వాత చెంగులు విడిచిన పాగాలతో నడుములో కటారులతో కురుచ బల్లెములతో, చేతిపై నిలిపిన డేగలతో "కయిజీతపు రాజులు" వెళ్ళిరి. ఆ రాజులవెంట వారి సామానులను మోయు తట్టువలు వెళ్ళెను. తర్వాత డాలు, కత్తులు పట్టిన బంత్లు పసుపువన్నె చల్లాడములతో, ఆ చల్లాడములకు కట్టిన చిరుగంటల మ్రోతతో, దృష్టి దోష పరిహారమునకై పెట్టించుకొనిన మసి బొట్లతో, నడుము దట్టీలతో, ఒరనుండి సగము బయటికి లాగిన కత్తులతో, ఆ బంట్లు వెళ్ళిరి. కర్ణాట దేశమందు బేండర్ (నిర్భయులు) అని పేరుగాంచిన బోయలు, నల్లని దట్టీల నడుములందు చుట్టి రంగు చెల్లాడముల దొడిగి వెండితో పొదిగించిన అంబులతోను, కటారులతోను, వీపున నుండు బాణాల పొదులు తలపాగల ముందుకు నూగుచుండ నల్లని పులులవలె నడిచిరి.

బంట్లు అంబులు, బాణాలు, తీసుకొని, మణికట్లపై ఇనుప కడెములు గలు గల్లు మనగా గోనె సంచులతో అవసరమగు యుద్ధ పరికరాలను మోసికొనుచు నడిచిరి. తర్వాత ఒంటరులు అను వీరభటులు దట్టీలతో వంక కత్తులను జొనిపి జుట్లను ఒంటిపొర గుడ్డలచే నెత్తికట్టి కొవెలకుంట్ల తిరుమణులతో, బాగా తోమిన తెల్లని దంతములపై అందానికిగాను చెక్కించిన బంగారు పువ్వులతో, రక్షగా తమ పెద్దలు కట్టిన తాయెతులతో నడిచిరి. భటులు తమ్ము సాగనంప వచ్చిన భార్యలను ఇంటికి పొమ్మని తొందర పెట్టిరి. కొందరు స్త్రీలు వెంట వత్తుమనిరి. తురక యోధుల భార్యలు తట్టువలపై నెక్కి, కాళ్ళ మెట్టెలతో, ముసుగులతో, సైన్యము వెంట వెళ్ళిరి. కన్నడ స్త్రీలు పలువురు వెండి సందెకడెములతో, నొసట విభూతితో, మంకెనలలో, పాలు, పెరుగు, నెయ్యి పెట్టి గిత్తలపై కట్టి తామును వాటిపై కూర్చుని సైన్యము వెంట పాలు, పెరుగు, నేయి అమ్ముటకు వెళ్లిరి. యువరాజుంచుకొనిన భోగిని ఒక పల్లకీలో పర్దాలు వేసుకొని బయలు దేరెను. ఆమెకు చెలికత్తెలు తాంబూలములు కట్టి యందింపగా పరదాలో నుండి బయటికి చేయిచాచి అందుకొను నప్పుడు ఆచేతి సౌకుమార్యమును, అంద