పుట:Andrulasangikach025988mbp.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతావేశముండెను. మరియు మతవ్యాప్తి చేయుట వారియాదర్శమై యుండెను. పైగా వారి సైన్యములో ఆశ్విక దళము అపారముగా నుండెను. గుర్రములు దక్షిణ హిందూస్థానమందు తగినట్టివి లేకుండెను. అరేబియా, పర్షియా దేశాల నుండియే అవి దిగుమతి యవుతూ వుండెను. అరబ్బులు, పారసీకు లీ వ్యాపారమందు కోట్ల ద్రవ్యమును గడించిరి. వారు సహజముగా తమ మతస్థులగు హిందూస్థానీ ముసల్మానులకు మొదలు గుర్రములను సప్లయిచేసెడివారు. విజయనగర చక్రవర్తులు గుర్రములు లేని లోపమును గమనించి వాటిని కొనుటకై సదా కృషిచేసిరి. గుర్రము లోడలలో వచ్చునప్పు డవి చచ్చిన వాటి తోకల దెచ్చి చూపిన గుర్రము ధర యిస్తూవుండిరి. ఒక్కొక్కమారు ఒక్కొక్క గుర్రమునకు 20 పౌను లిచ్చిరి. పోర్చుగ్రీసువారు ఏటేట 1000 గుర్రములు సప్లయి చేసిన, తాను 20,000 పౌను లిత్తునని కృష్ణదేవరాయ లనెను.

హిందూ సైన్యములో మరొక లోప మేమనగా, వారికి తుపాకిమందు, ఫిరంగీలు తక్కువై యుండెను.[1] వాటి యుపయోగమును వారు తురకలనుండియే నేర్చుకొనవలసి వచ్చెను. తురకల యుద్ధతంత్రము మేలైనదిగా నుండెను. వారు యుద్ధధర్మములను పాటించినవారు కారు. హిందువు లింకను పురాణయుగము నుండి బయటపడినవారు కారు. మూడవ భల్లాలరాజు మధుర సుల్తానులపై దండెత్తి ముట్టడించగా తురక లోడిపోవుట నిజమని గుర్తించి సంధి చేసికొందుమనియు దాని కవకాశ మియ్యవలెననియు కోరిరి. భల్లాలు డొప్పుకొనెను. అతడును అనని సైన్యమున్ను ఇక యుద్ధము లేదని నిశ్చింతగా నిద్రించగా రాత్రి ముసల్మానులు వారిపై బడి పౌప్తిక ప్రళయము గావించి, భల్లాలును బట్టుకొని అపార ధనమిచ్చిన విడుతుమని, లాగవలసిన దంతయులాగి ఆతని తిత్తి యొలిపించి తోలులో గడ్డినింపి కోటకు వ్రేలాడ గట్టిరి.

ఇట్టి మోసాలు ఔరంగజేబు మరణమువరకు ముసల్మానులు చేసినను, పూర్వము కూడ గోరీ, అల్లావుద్దీన్ మున్నగు సుల్తానులు బహు మోసములు చేసినను హిందువులు గుణపాఠము నేర్చుకొనలేదు: నేర్చుకొన దలచలేదు!!

"దక్షిణదేశ హిందూ రాజుల వద్ద అపార ధనమున్నదనియు, వారిలో ఐక్యత లేదనియు, అన్నిటికన్న మకుటాయమానమగు లోపము హిందూసైన్య

  1. V. S. C. P. 222.