పుట:Andrulasangikach025988mbp.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనాటి విదేశీ యాత్రికులు విజయనగర రాజ్యమందు సర్వమత సహన ముండుటను చూచి యాశ్చర్యముతో ప్రశంసించిరి. రాజులలో మతసామరస్య ముండినను జనులలోను, మతాచార్యులలోను అది మృగ్యమై యుండుట శోచనీయము.

మధుర రాజ్యములో ముసల్మానుల క్రూరచర్యలను తెలుప నైనది. అట్టి చర్యలే ఆంధ్ర కర్ణాట ప్రాంతాలలో ముసల్మానులు కాలు బెట్టిన తావులలో వ్యక్తమయ్యెనని యప్పటి వాఙ్మయములో విశేషముగా వర్ణింపబడెను. శ్రీకృష్ణ దేవరాయలే యిట్లు వర్ణించెను.

         సీ. సనకాది దివిజ మస్కరి ఫాలగోపిచందన
                పుండ్రవల్లిక ల్నాకి నాకి
            సెలసి హాహాహూహూవుల దండియలతంత్రి
                ద్రెవ్వసింగిణులుగా దివిచి తివిచి
            సప్తర్షి కృతవియజ్ఘర వాలూకాలింగ
                సమితి ముచ్చెలకాళ్ళ చమిరి చమిరి
            రంభాప్రధానాప్సర: పృథూరోజకుంభంబు
                లెచ్చట గన్న బట్టి పట్టి

            తిరుగు హరిపురి సురతరుసురల మరగి
            బహుళ హళి హళి భృతకలబరిగనగర
            సగర పురవర పరిబృడ జవన యవన
            పృతసభవదసి నని దెగి కృష్ణరాయ.[1]

"గోవధంబుసేయు తురకల దైవంబవు నీవు" అని చంద్రుని పెద్దన తిట్టెను.[2]

సైనిక వ్యవస్థ

ముసల్మాను విజృంభణమున కొక కారణము:- హిందువులలో మత కుల ద్వేషాలుండుటచే ఐకమత్యము లేకపోవుటయని తెలిపినాము. మరొక కారణము, హిందువుల యుద్ధ నిర్వహణ లోపమైయుండెను. ముసల్మానులలో ఐక్యత,

  1. ఆముక్త మాల్యద. 1 - 41.
  2. మనుచరిత్ర 3 - 42.