పుట:Andrulasangikach025988mbp.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణ దేవరాయలే తన ఆముక్త మాల్యదలో శైవ ప్రభువులు పరమతస్థుల కపచారము చేయుటను, పర దేవతాయతనములను పడగొట్టి శైవ మఠముల కట్టించుటను ఈవిధముగా వర్ణించెను. ఒక పాండ్యరాజును గూర్చి విష్ణుగుప్తునితో శ్రీరంగనాథు శిట్లనెనట.

         "వెర్రిశైవంబు ముదిరి మద్వినుతి వినడు సతి యొ
          నర్పడు మామక ప్రతిమలకును
          హరుడె పరతత్త్వమను, మదీయాలయముల
          నుత్సవంబుల కులుకు నెయ్యురును నట్లె.

          సీ. ఆశ్రాంత జంగమార్చనవక్తి వర్తిలు
                 వేదవద్ద్విజపూజవీటి గలిపి
             భౌమవారపు వీరభద్ర పళ్ళెర మిడు
                 గృహదైవతంబు లిర్రింకు లింక
             షణ్ణవతి శ్రాద్ధచయ మారబెట్టు సం
                 కర దాసమయ్య భక్తప్రతతికి
             అద్యంబులైన దేవాలయంబులు వ్రాల
                 నవవీ నిరాశమఠాళి నిలుపు

             జందెముత్తర శైవంబు జెంది త్ర్ంచు ప
             తితు లారాధ్యదేవళ్ళె ప్రాప్యులనుచు
             ఉపనిషత్తులు వారిచే నబ్బి వినుచు
             వెండి యేజంగ మెత్తిన వెరగుపడును.

       క. శివలింగము దాల్చిన జన నివహంబేమైన జేయు నిది పాపము దా
          నవుగా దన డాసమయమున నవునను విప్రులకె యగ్రహారము లిచ్చున్.[1]

ఆ పాండ్యరాజు శైవులు గంజాయి త్రాగినను చూచీ చూడనట్లుండి విప్రుతలతప్పు కొంచెమైనను పంచాయతిసభ కెక్కించి వారికి శాస్తి చేయించెననియు, ఆ రాజును నమ్మించుటకై యిష్టము లేకున్నను ఇతరులు రుద్రాక్ష పేరులు మెడనిండ ధరించి చంకలో వీరశైవ పుస్తకమగు సూతసంహితల నిరికించుకొని తిరిగిరనియు నిదే సందర్బములో తెలిపెను. రాజులును, మతా

  1. ఆముక్తమాల్యద 4-42 నుండి 44,