ఈ పుట ఆమోదించబడ్డది
లేదనియు, చాలనివాడననియు అంగీకరింపక యుంటిని. కాని మా మిత్రులలో శ్రీ లోకనంది శంకరనారాయణరావు, శ్రీదేవులపల్లి రామానుజరావు, శ్రీ పులిజాల హనుమంతరావుగారలు చేసిన ప్రోద్బలము తట్టుకొనరానిదయ్యెను. తుది కొప్పుకోక తప్పదయ్యెను. అవసరమగు పరికరములు నాకు లభింపనందున నాకీ గ్రంథము తృప్తినొసగలేదు.
ఈ గ్రంథ ముద్రణమును, ప్రూపులను చూచుకొనుట మున్నగు శ్రమకులోనైన ప్రియమిత్రులగు శ్రీ దేవులపల్లి రామానుజరావు నా మనఃపూర్వకమగు కృతజ్ఞతలకు పాత్రులైనారు.