పుట:Andrulasangikach025988mbp.pdf/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లను నాలుగైదేండ్లకన్న నెక్కువగా సహించి యుండినది కాదు. కాని డిల్లీనుండి పొరకచుక్కకు (ధూమకేతువు) వలె విజయధాటీ సమారంభముతో చూచినదెల్ల వశ్యముగాను, పట్టినదెల్ల బంగారముగాను, సాగినమార్గ మంతయు జైత్రయాత్రగాను, కావించిన మలిక్ కాఫిర్ తమిళ పాండ్యదేశమందలి మధురలో ముస్లిం రాజ్యమును స్థాపించి పోయెను. అచ్చట సుల్తాను లేడుమంది ఇంచుమించు 50 ఏండ్లు రాజ్యము చేసిరి. ఆ రాజ్యకాలములో వారు తలచినట్లెల్ల ప్రజలను దుర్బర హింసలపాలుచేసిరి. ఆంధ్రదేశమున కది సంబంధించకున్నను వారిచర్యలంతటను నొకేవిధముగా సాగినవగుటచేతను తెనుగుదేశమునను జనులకు కలిగిన కష్టాలను తెలుసుకొనుట కుపకరించునని యిచ్చట వాటి మాసర తెలుపబడును.

వీరకంపరాయచరిత మను నామాంతరముకల మధురా విజయ మనుకావ్యమును కంపరాయల భార్య యగు గంగాదేవి వ్రాసెను. అది సత్యమయిన చారిత్రిక గ్రంథము. క్రీ.శ. 1371 లో కంపరాయలు మధుర నుండి తురకల నోడించి వెళ్ళగొట్టెను.

మధురా విజయములో ఒక స్త్రీ కంపరాయని కాంచీనగరమందు దర్శించుకొని, మధుర రాజ్యమందలి తురకల పాలనము నిట్లు వివరించెను.

        అధిరంగ మవాప్తయోగ నిద్రాం హరి ముద్వేజయతీతి జాతభీతి:
        పతితం ముహు రిష్టికానికాయం ఫణచక్రేణ నివారయ త్యహీంద్ర:

హరియొక్క యోగనిద్రకు భంగము కాకుండా, శ్రీరంగగోపురపు ఇటికలు పడిపోగా శేషుడే తన తలలతో ఆనబట్టుతున్నాడు. (పాములు పారాడిన వన్నమాట)

        ఘుణజగ్ధ కవాట సంపుటాని స్ఫుట దూర్వాంకుర సంధి మండపాని
        శ్లథ గర్భ గృహాణి వీక్ష్య దూయే భృశమన్యాన్యపి దేవతాకులాని.

దేవతాయతన ద్వారాలను చెదలు తిపివేసెను. మంటపాలు విచ్చు కొని పోయి వాటి సందులలో గడ్డి పెరిగినది. గర్బగృహాలు పడిపోయినవి. ఈ యవస్థ ఇతర దేవాలయములకును కలిగినది.

        ముఖరాణి పురా మృదంగ ఘోషై రబితో దేవకులాని యాన్యభూవన్
        తుమ్ములాని భవంతి ఫేరవాణాం నినదై స్తాని భయంకరై రిదానీం.