పుట:Andrulasangikach025988mbp.pdf/186

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


4 వ ప్రకరణము

విజయనగర సామ్రాజ్య కాలము

క్రీ.శ. 1339 నుండి 1530 వరకు

మతము

ఒక దిక్కు రెడ్డి రాజ్యము. వెలమ రాజ్యము స్థాపితములు కాగా మరొక దిక్కు విజయనగర సామ్రాజ్య మారంభ మయ్యెను. అందుచేత రెడ్డిరాజుల కాలముతో బాటుగ విజయనగర రాజ్యకాలచర్చయు చేయుట యవసరమైనది. సామ్రాజ్య స్థాపనకాలమునుండి శ్రీకృష్ణదేవరాయల నిర్యాణము వర కీ ప్రకరణమున చర్చించబడును.

పలువురు చరిత్రకారులు విజయనగర సామ్రాజ్య స్థాపనము క్రీ.శ. 1336 లో నయ్యెనన్నారు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1570 లో చనిపోయెను. క్రీ.శ. 1565 లో తళ్ళికోట యుద్ధమందు రామరాజు వధ్యుడై విజయనగర విధ్వంసము దక్కన్ సుల్తానులచే అతి ఘోరముగా జరిగెను. పెనుగొండలో మరల తిరుమలరాయలు నిలద్రోక్కుకొని తురకల యాక్రమణను నిరోధించి రాజ్యము చేయకలిగెను. కాని, శ్రీరంగరాయలు చాలా దుర్బలు డగుటచే రాజధాని చంద్రగిరికి మారెను. అచ్చట కొంతకాలము నామమాత్రావశిష్టముగాసాగి తుదకు క్రీ.శ. 1620 ప్రాంతములో విజయనగర సామ్రాజ్యము రూపు మాసెను. క్రీ.శ. 1530 నుండి 1629 వరకు ముందు ప్రకరణములో చర్చింతుము.

ఓరుగంటిని మంట గలిపిన ముసల్మానులు తెనుగుదేశ మంతటను వ్యాపించుకొని తమ ఘోరకృత్యములను నిరాఘాటముగా సాగించిరి. అట్టిసమయములో ప్రోలయ కాపయనాయకులు వారిని తరుముటయు, రెడ్డి వెలరాజులును అదేపని చేయుటయు సంభవించినందున తెనుగు దేశము తురకల పైశాచికము