పుట:Andrulasangikach025988mbp.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్గకవిత (సంస్కృత పద్ధతి) నుండి భిన్నించిన దేశికవితను గూర్చి తెలిపెను. సంగీత శాస్త్రములలో మార్గవిధానము. దేశివిధాన మున్నవని వివరించినాౠ. రామాయణమును కుశలవులు "అగాయితాం మార్గవిధాన సంపదా"అని రామాయణములో వ్రాసినారు. "దేశిమార్గ లాస్య తాండవంబులు" అని కాశీఖండములో చెప్పినారు.

దేశినృత్యవిధానాలే జనులకు ప్రీతి నిచ్చినవై యుండెను. ఆ నృత్యాలలో పురుషు లాడునవి కొన్ని, స్త్రీలాడునవి కొన్ని యుండెను. కోలాటముపై అందెలు వేయుచు కోలంట్లువేయుచు పాడుచు మగవా రాడెడివారు. స్త్రీలు వలయాకారముగా చప్పట్లు చరుచుచూ ఆడేవారు ఇప్పటికి తెలంగాణాలో బతకమ్మపాట అనునది, రాయలసీమలో బొడ్డెమ్మ అనునది యీ విధానపు గీతికాయుక్త నృత్యమే!

స్త్రీలు గొండ్లియాటను ఆడిరి:-

        "వీరు మైలారదేవర వీరభటులు గొండ్లియాడించుచున్నారు గొరగపడుచు
         నాడుచున్న చూడు మూర్ధాభినయము తాను నెట్టిక సీలంతగాని లేదు."

గొండ్లి (గొండిలి) అనునది కుండల అనుదాని తద్బవమేమో! కుండలాకార నృత్యమే గొండ్లి. గొండ్లి విధానమే బతకమ్మ, బొడ్డెమ్మ ఆటలు. గొరగపడుచు అనిన మైలారుదేవుని గొలుచు స్త్రీ. ఆ స్త్రీ నీటి పాత్రలోని వస్తువును మొగ్గవాలి నాలుకతో నందుకొనె ననియు అందే వర్ణించినాడు.

నాట్యములలో దేశి మార్గ నృత్యములను గురించి శ్రీనాథుడు కాశీఖండములో రెండు మూడు తావులలో నుదాహరించినాడు.

జక్కిణి యనియు, చిందు అనియు రెండుదేశీనృత్యము లుండెను. జక్కిణిని గురించి దశావతార చరిత్రలో నిట్లు వర్ణించినారు.

         "దురుపదంబులు సొక్కుమై సిరులువొసగ
          సరిగ నిరుగెల కుంఛియల్ సవదరించి
          పెక్కువగ జక్కిణీకో పు ద్రొక్కె నొక్క
          చక్కనిమిటారి నరపతుల్ సొక్కి చూడ"[1]

  1. Hist. R. K. Page 432