పుట:Andrulasangikach025988mbp.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         గాలంపుగొంకి గంకాళచర్మము గ్రుచ్చు యుడువీధి నుయ్యెల లూగువారు
         కటికి హోన్నాళంబు గండకత్తెర వట్టి మిసిమింతులునుగాక మ్రింగువారు
         వందులను నారసంబులు సలుపువారు యెడమ కుడిచేత, నారతులిచ్చువారు
         సాహసమ మూర్తిగై కొన్న సరణివారు ధీరహృదయులమైలారు వీరభటులు[1]

పెద్దపెద్ద పొడవైన గుంతలలో ఎర్రని బొగ్గునిప్పులు పోసి వారందు నడచిపొతూ వుండిరి. నేలపై శూలాలు పాతి పెద్ద గడపై నుండి ఉట్టి ఊగి వాటిని త్రెంపుకొని అ శూలాలపై పడుతూ వుండిరి. బహుశా ఆత్మ బలిదాన మవుతూ వుండిరి.

ఒక గడపై తిరుగు ఇనుప కడెమునకు కట్టిత్రాడు కొననున్న ఇనుప కొండిని వీపు చర్మానికి క్రుచ్చుకొని దానిపై వ్రేలాడబడి గడె చుట్టును రంకు రాట్నమువలె తిరుగుతూ వుండిరి. బంగారు నాళపు (హొన్ను+నాళము) పిడిగల గండకత్తెర (తల నరకు సాధనము)తో తల పండు విచ్చుకొను చుండిరి. బాణాలను (దబ్బనములను=శస్త్రములను) ఒంటి సంధులందు గ్రుచ్చుకొంటూ వుండిరి. నేటికిని కార్తీకనంది సేవలలో శైవులు ఆవేశమ తో దబ్బనముల (శస్త్రాల-సతాలతో) దవడలకు క్రుచ్చుకొందురు. అరచేతులలో కర్పూరమును వెలిగించి దేవరకు హారతు లిచ్చిరి. ఇవి అబద్ధమయిన ముచ్చట్లు కావు.

విజయనగర చక్రవర్తుల కాలములో వీపున కొంకిని గ్రుచ్చుకొని జనులు ఉయ్యెల లూగిరనియు, ఇతర సాహస హింసాయుత కార్యాలను ప్రదర్శించిరనియు కాంటి యను యూరోపుఖండవాసి వర్ణించి యుండెను. పైగా నేటికిని నిప్పులలో నడుచుట, దబ్బనాలు క్రుచ్చుకొనుట, అరచేతులలో కర్పూర హారతులిచ్చుట శైవులలో కాననగును.

భరతముని ప్రతిపాదితమగు నాట్యభంగిమములు శాస్త్రోక్తముగా కూచిపూడివారు బహుశా అభినయిస్తూ వుండిరేమో! కూచిపూడివారి నృత్య మీ కాలమందే వ్యాప్తిలోనికి వచ్చియుండును. సామాన్య జనులు మాత్రము తమకువచ్చినట్టి దేశీనృత్యములందాసక్తి కలిగియుండిరి.

కవితలో సంగీతములో నృత్యములో దేశివిధానము, మార్గ విధానము అని ప్రాచీనమునుండి రెండువిభిన్నరీతు లేర్పడియుండెను. నన్నెచోడుడు

  1. క్రీడాభిరామము.