పుట:Andrulasangikach025988mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏనుగుల వీరాస్వామి - కాశీయాత్ర.

పాండురంగ విజయము, శ్రీ కాళహస్తి మహాత్మ్యము, శ్రీనాథుని చాటువులు, పీఠికలు కూడా కొంతవరకు సహాయపడును.

శబ్దరత్నాకర నిఘంటు నిర్మాతలగు బహుజనపల్లి శీతారామాచార్యులుం గారు కవుల తారతమ్యములను నిర్ణయించి వారిని ఆరు తరగతులుగా విభజించిరి. అందు పై కవులకు వారే స్థానమిచ్చిరనగా:-

ప్రబంధము. తరగతి.
పాల్కురికి పాండితారాధ్య చరిత్ర 5
పాల్కురికి బసవపురాణము 5
ద్వాత్రింశత్సాలభంజికలు 4
ఆముక్తమాల్యద 4
వైజయంతీ విలాసము 5
శుకసప్తతి 5

కొన్ని ప్రబంధాలు వారి కాలాన ముద్రితములు కాలేదు. అయియుండిన వాటికినీ కనిష్ఠము అయిదవ తరగతిలో సీట్ దొరకకపోయి యుండునా?

సాంఘిక చరిత్రకు పనికిరాని కవిజన రంజనము, కవికర్ణ రసాయనము, జైమినీ భారతము, రామాభ్యుదయము, విక్రమార్క చరిత్రము, విష్ణుపురాణము, మనుచరిత్రను, వసుచరిత్రను మూడవ తరగతిలో చేర్చినారు.

అమృతాంజనమును, అమృతధారను, బహునిఘంటువులను, వేదంవారిని చుట్టూ పెట్టుకొని చదువదగిన నైషధము, రాఘవ పాండవీయము, హరిశ్చంద్ర నలో పాఖ్యానములకు రెండవ మూడవస్థాన మిచ్చినారు.

నే నప్పుడప్పుడు 1929 నుండి వ్రాసిన సాంఘిక చరిత్ర వ్యాసములను జూచిన మిత్రులు ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపితమైనప్పుడు ఆంధ్రుల సాంఘిక చరిత్రను వ్రాయమని తొందర పెట్టిరి. అంతటి శ్రమకు అర్హత