పుట:Andrulasangikach025988mbp.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         మైలమందుల కొయ్య కత్తెర, మారుగన్నపు కత్తియున్
         నీలిదిండులు, నల్లపూతయు నేర్పుతోడుగ మ్రుచ్చులున్"
        'పాలెమున్న వారిపై నొల్కి బూడిద మందుచల్లి పెద్ద మగులు కొంత
         కూలద్రవ్వి రాచకూతురుండు మేడ కత్తిరించినట్లు గంటువెట్టి'
  
        "తొడితొడి క్రోవుల పువ్వుల విడిచి దివియు లార్చి...రి"[1]

పైవర్ణనలోని చౌర్యపరికరములలో ఒల్కిబూడిదయొక్కయు, వెలుగును ఆర్పి వేయునట్టి పుర్వులక్రొవియొక్కయు ఉపయోగమును తెలిపినారు శ్మశానములో పీనుగుల గాల్చిన బూడిదను నిద్రించువారిపై చల్లిన అది మచ్చుమందుగా పనిచేయునని దొంగల విశ్వాసము. అందును "పాలెమున్న వారిపై" చల్లుచుండిరి. (పాలెము అన మొదటి యర్థము కావలి. సీమాంతమందు దుర్గాధి పతులుగా నుండి తగినంత సైన్యములు కొని ప్రతిఫలముగా జాగీర్లను పొందిన వారి కర్థమయ్యెను. వారిదండును కూడా పాలెమనిరి.) గాలిచీర అన గాలి జొర కుండుటకై అడ్డముగా పెట్టెడు వస్త్రము. గ్రద్దగోరు అన 'చోరసాధన విశేషము' అని శబ్దరత్నాకరకారుడు వ్రాసెను. అంతమాత్రము మనకును తెలియును. దొంగలు గ్రద్దగోరుతో కన్నము పెట్టుచోట గీయుదురు. అ గీత మెత్తదనమును బట్టి అట కన్నము పెట్టుదురు. అటు కానిచో మరొక తావున గీయుదురు. దొంగల కట్టి విశ్వాసముండెను. అది గ్రద్దగోరుయొక్క ప్రయోజనము! తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో ఈ విశ్వాసము నేటికిని కలదు. కొంకియన కొండివంటి వంపు చీల. దానికి త్రాడుగట్టి గదులలోనికి దిగి సామానులను అ చీలకు తగిలించి త్రాడులాగి సైగ చేసిన పై నున్నవారు గవాక్షము ద్వారా చేదుకొని తీసుకొనుచుండిరి. కట్టకడపట దిగినవాన్ని కూడా అత్రాటితో చేదుకొనుచుండిరి. పుర్వులక్రోవి యనియు, క్రోవుల పువ్వులు అనియు కవి రెండురూపాలు వాడినాడు. రెంటిలో పుర్వులు అనునదే సరియగు రూపము. క్రోవి అన గొట్టము. అందు పుర్వులను అనగా పురుగుల నుంచి వాటిని దీపములపై విడిచిన అవి వాటిని ఆర్పుచుండెను. దీపము లార్పు పుర్వు లేవియో ముందు కనుగొందుము. ముడ్ల బంతి యెట్టిదో? ముండ్లబంతిని త్రాడునకు గట్టి గవాక్షము ద్వారా వదిలితే కొండ్లకు సామానులు తగిలిన వాటిని చేదు కొనుచుండిరేమో! అదే ముండ్ల (కొండ్ల) బంతి (Circle) అయి యుండును.

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 88.