పుట:Andrulasangikach025988mbp.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        "పనిచేసి గంజియైనను అంబలైనను నెద చల్లగా ద్రాగి యెచటనైన
         పడియుండి వెన్నెల గుడిపాటపాడగా పేదల కాత్మసంప్రీతి కలుగు."[1]

వెన్నెలగుడిపాట యన నెట్టిదో తెలియదు. వెన్నెలలో పాడునట్టి పాటయని మాత్ర మూహింప వచ్చును. పాల్కురికి తెలిపిన వెన్నెల పాట యిదియై యుండును.

గుర్రములకు నడక నేర్పుట యొక అనుభవవిధానమై యుండెను. మంచి గుర్రపురౌతులు ప్రత్యేకముగా గుర్రములను సాధించువారై యుండిరి. గుర్రపు నడకలు పలువిధములవై యుండెను. మన సమీక్షాకాలములో "జోడనయు, జంగనడకయు, తురికినడకయు, రవగాలునడక యుంగల వారువంబులు" ఉండెను.[2] జోడన అనధౌరితకము అనియు, జంగన అనగా కాలు చాచిపెట్టి నడచునడక అనియు, రవగాలునడకయన అస్కందితము అనియు శబ్దరత్నాకరములో వ్రాసినారు. కాని తురికియన గుర్రమని యర్థము వ్రాసినది ఈ సందర్భమునుబట్టి కుదురదు. నాలుగుకాళ్ళను ఎట్టి సవారిపోయిన ఈనాడు దానిని చాతురికినడక అందురు. బహుశా అది చౌతురికియై యుండునో యేమో ?

దొంగతనము అందులో కాన్నపుదొంగతనము, బందిపోటు దొంగతనము జనులకు బాధాకరమైనదైనను కవులవర్ణనలలో అదొక కళగా పరిణమించినది. సంస్కృతవాఙ్మయమందు దండి దశకుమారచరిత్రములోను, శూద్రకుడు మృచ్చకటికా నాటకములోను దొంగతనమును వర్ణించుటను చదివినవారి కదొక ప్రీతిదాయకమగు కళగా కానవచ్చును. అమర్యాద ననుసరించి కొరవి గోపరాజు చౌర్యవిద్యను వర్ణించువిధాన మిట్లున్నది.

దొంగలు కాళికాది శక్తిదేవాలయముల కేగి తమదొంగతనము విజయవంతముగా కొనసాగిన అమ్మవారికి ముడుపు లిచ్చుకొందుమని మ్రొక్కుకొందురు. ఊళ్ళలో చీకటిపడగానే అరెకులు (తలారులు) కావలిగా తిరుగజొచ్చిరి. దొంగలు సిద్దమైన విధ మెట్టిదనగా,

        "గాలిచీరయు నొల్కిబూడిద గ్రద్దగోరును గొంకియున్
         కోలయున్ వెలుగార్చు పుర్వుల క్రోవి ముండులబంతియున్

  1. సిం. ద్వాత్రింశిక భా 2. పు 59.
  2. సిం. ద్వాత్రింశిక భా 2 . పు 41