పుట:Andrulasangikach025988mbp.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'భాగోతులైరి. శ్రీనాథునితో లేక సమకాలకవిదో యైన ఒక చాటువు. "భాగోతుల బుచ్చిగాడు"వసిద్ధముగా అచ్చపు స్త్రీలవలెనే స్త్రీ వేషమువేసి అకర్షణీయముగా ఆడుచుండెననియు, పాడుచుండెననియు, "పెండెల నాగి" అను స్త్రీయు అట్టిదే యనియు, స్త్రీలు (తక్కువజాతి 'నాగి', 'గంగి' వంటివారు) కూడా స్త్రీపాత్రల నభినయిస్తూ వుండిరని తెల్పుటకు సహాయపడినది. క్రీడాభిరామమునకు వీధి నాటకము అని పేరు. దానిని ప్రదర్శించిరని అందిట్లు తెలిపినారు.

        "నటులది దోరసముద్రము, విటులది యోర్గల్లు, కవిది వినుకొండ మహా
         పుటభేదన మీ త్రితయము, నిటు గూర్చెను బ్రహ్మ రసికులెల్లరు మెచ్చన్"

అయితే క్రీడాభిరామము ప్రదర్శన యోగ్యముగా లేదు. ప్రదర్శించిన ప్రజల కర్థమై యుండదు. అర్థము కానిదాన్ని జనులు చూడరు. వీధి నాటకము అనుటలోనె దాని చరిత్ర యిమిడియున్నది. అవి యిప్పటివలె టికటు నాటకాలు కావు. వీధులలో కొద్దిపాటి పరికరాలతోనే ఉచితముగా జనుల యెదుట నాటకాలాడుతూ వుండిరి. గ్రామ ముఖ్యులు, ధనికులు నాటకమువారిని పోషిస్తూ వుండిరి.

జనులు అనేక విధములగు పాటలు పాడుకొనుచుండిరని కాకతీయ కాలమందు తెలిపినాము. పల్నాటి వీవీరుల చరిత్రమును పిచ్చుకుంట్లవారును, కాటమరాజు కథను గొల్లవారును, ఎల్లమ్మ కథను బవనివారును చెప్పువారైరి. ఈవిధముగా ద్విపద భేదాలతో కథలుపాడి వినిపించి జీవించు కులాలు కొన్ని యేర్పడెను. ఎల్లమ్మ కథయే రేణుకాకథ. దీనిని చాలా విపులముగా పురాణకథకు భిన్నముగా రెండుదినాలవరకు ఐవనీండ్లు జవనిక వాయిస్తూ చెప్పుదురు. వీరే పెద్దదేవరకథను రాయలసీమలో చెప్పుదురు. ఇది పురాణాలలో నెందును లేనట్టిది. బ్రాహ్మణయిండ్లలో కామేశ్వరికథ బ్రసిద్ధమైనది. దానిని ప్రొద్దున మొదలుపెట్టి సాయంత్రమువరకు చెప్పుదురు. "అక్కలు లేచేవరకు నక్కలు కూసె" అన్న సామెత దీనినిబట్టియే వచ్చినది. ఈ కథ గుంటూరు కృష్ణాగోదావరి జిల్లాలలో విశేషప్రచారమందున్నట్లు కానవచ్చును. ఈకథను జక్కులవారు చెప్పెడివారని క్రీడాభిరామమందు వర్ణించినారు.

క్రీడాభిరామములోని 'కామవల్లీ' కథాసూచన యిదియే. బీదలు, పని పాటలు చేయువారు, మోటకొట్టువారు, కలుపుదీయువారు, దంచువారు, విసురువారు, పాటలుపాడుచు పనిచేయుచు ఆయాసమును మరుస్తూ వుందురు.