పుట:Andrulasangikach025988mbp.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకను భల్లూక దృష్టి, గృధ్రదృష్టి, ఫణిదృష్టి, కపిదృష్టి, చోరదృష్టి, శార్దూలదృష్టి కూడ వర్ణించి "సురియకాండ్ర పంత మిదియ" అని తేల్చెను..

అయితే యీ రెండును సాధారణముగా కత్తియుద్ధాలలో పెట్టు పంతములు కావు.

"అనుడు వింతపంతంబుల కచ్చెరువంది పొందుగా జూచి విడువుండన భట్టియు, అంగాదీశ్వరుండును నిలువంబడి, విస్తారంబుగలుగ వైహాళి దీర్చి, యెల్లజనులం గూర్చుండ విడి, గలబ పుట్టకుండ, ఎడ వెడన్ తలవరుల విలిపి, పట్టెదు వారల మాటమాటలలోను పట్టుండని నియమించి, నలువురుబంట్ల నడుమనిడి, కఠారంబులు ఒక్క కొలందిగా కొలిచి, నిమ్మపంద్ల దొడిసి, ఎడగలుగ బంటుచేతికిచ్చినన్ పమ్ముకొని యవ్వీరులు, ధీర ధీరంబుగ జొచ్చిరి."[1]

పంతంబుల పద్యములోచౌబళము, దాణి, అరువ అను పదాలకు నిఘంటువులలో అర్థాలు లేవు.

గారడీ అను విద్యను ఇంద్రజాల మనిరి. ఇంగ్లండులోని ఇంగ్లీషు పత్రికలలో ఇంచుమించు 40 ఏండ్లనుండి యొక చర్చ కొన్నిమారులు చేసినారు. ఇంచుమించు 150 ఏండ్ల క్రిందట ఒక ఇంగ్లీషు వాడొక ఇంద్రజాల ప్రదర్శనమును హిందూస్థానములో చూచి దాన్ని చాలా మెచ్చుకొని అనాడే పత్రికలో వ్రాసెను. ఆ ఇంద్రజాలమ లో ఒకడు త్రాటి నొకదానిని పైకి నిలువుగా విసరి గాలిలోనిలబెట్టి దానిపై కెగబ్రాకి మాయము కాగా, వాని యంగములు ఖండ ఖండములుగా క్రిందబడె ననియు, మరి కొంతసేపటికి వాడు త్రాటినుండి గబ గబ దిగివచ్చెననియు వ్రాసెను. అది యబద్ద మనియు, అట్టి విద్యను ప్రదర్శించు వానికి ఇంగ్లండుకు రానుపోను వ్యయమును భరించి వేలకొలదిగా బహుమానము లిత్తుమనియు కొందరు ప్రకటించిరి. కాని కొరవి గోపరాజు ఒక కథలో ఇదేవిధమగు ఇంద్రజాలమును వర్ణించినాడు.

ఒకడు తనభార్య అనుదానిని వెంటబెట్టుకొని రాజసన్నిధిలో ఆమెను రక్షణార్థమై విడిచి, తాను దేవసహాయార్థమై యుద్ధముచేయ వెళ్ళుతున్నాని చెప్పి ఒక త్రాటిని పైకి నిలువుగా విసరి, దాన్ని నిలబెట్టి, దానిపై కెగబ్రాకి

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 21, 24.