పుట:Andrulasangikach025988mbp.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమో ఉత్తుత్త రోషానికి వచ్చి తీరా ఎదుటివాడు తీసుకొని ఎదురునిలచి నప్పుడు తోకముడిచే వ్యవహారము కాగూడదుసుమా అని ఒకలెంక యిట్లనెను. "గుడికొలువుబంటు మల్లని కొలది పంతమయ్యె నిచ్చట నది తెట్టులంటిరేని"

"ఒకడు దేవర భాండాగారంబు నింటికడన్ పాలెమువడం గొలిచి పళ్ళెరంబుల ప్రసాదంబు తినుచు పోతుక్రియ నుండ నొక్కనాడు, దేవరను దర్శింప వచ్చి వారి సందడిలో నొక్క యీడిగ తనకాలు ద్రొక్కినన్ కోపించి ఏమిరా, బంటుమల్లు నన్నెరుంగవా తన్నితివి, అనిన, నతండు నే నెరుంగన, ఈ సందడిలో కాలుదాకె, ననిన, నెరయం దన్ని యెరుంగ ననినం పోనిచ్చెదనా ? యనుచు నందందు దట్టించిన అయ్యీడిగడా కేలి కటారి వలకేల నందుకొని, తన్నినాడ, యేమనియెదవురా ? అనిన అతని బిరుసు చూచి బంటు మల్లండు స్రుక్కి, ఏమియు నేమనియెద, దేవర కూడిగంపు బంటుంగాన దోసమనియెద ననియెం గావున,

        "మీకు పిన్నవాడ ఏకాంగవీరుండ రంకెవైచిన, నడబింకమైన,
         నగిన, కేరడించినన్, మీస లంటిన, పట్టితివియ నాకు పాడిగాదె"

అట్టి ద్వంద్వయుద్ధాని కేమేమి 'పంతముల కొలదుల' (షర్తులు) విచారించగా అందొక భటు డిట్లనెను.

        "పుల్లతి వెట్టిన, భూమికి కొసరిన, ఎదిరి పోటునకు చే యొదుగుచున్న,
         దండకై దప్పిన, తప్పు క్రేళ్ళురికిన, పంతంబుగొన్న, చౌఒళము గొన్న,
         దాణికి జొచ్చిన, దాచిన, మానిన, అరువ నొడ్డిన బయలాన పడిన,
         చాగ బొడువకున్న, లాగంబునకుకొన్న, మడమ గెంటిన, వ్రేళ్ళు మగుడబడిన,
         తారుమారైన, తలవంచి పొడిచిన, పారుగా తలంచు పంత మిదియె."

            ఇందలి కొన్ని పదాలు కత్తిసాములోని సాంకేతికములు.

పైవాని ప్రతిస్పర్ధి పెట్టిన ఎదురుపంతము కొలదులు (ఎదురుషర్తులు) ఎట్టి వనగా;_

        "మతిగాక దృష్టి నేమరక రక్షించుచు సూకర దృష్టిమై డాక గొలిపి
         గర్జనసేయక మార్జాలదృష్టిమై తరలక వరుజించి తాకబూని"